KTR On Farmers Maha Dharna in Nalgonda : ఈ నెల 28న నల్గొండలో రైతు దీక్షకు హైకోర్టు అనుమతి ఇచ్చిందని బీఆర్‌ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రాజ్ భవన్ ముందు ధర్నా చేయవచ్చు కానీ, నల్గొండ క్లాక్ టవర్ దగ్గర ధర్నా చేస్తే ఇబ్బందులు వస్తాయని అనుమతి నిరాకరించారని ఆరోపించారు. రైతు సమస్యలపై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.
బీఆర్‌ఎస్ రైతు కమిటీ రాష్ట్రమంతటా పర్యటిస్తుంది : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన బీఆర్ఎస్ అధ్యయన కమిటీ తొలి సమావేశానికి హాజరైన కేటీఆర్ రాష్ట్రంలో తీవ్రమైన వ్యవసాయ సంక్షోభం, ఆందోళనకర స్థాయిలో పెరిగిన రైతు ఆత్మహత్యలపై ఏర్పాటు చేసిన కమిటీ నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తుందని పేర్కొన్నారు. ఈ నెల 24వ తేదీ నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి బీఆర్‌ఎస్ రైతు కమిటీ పర్యటన ప్రారంభం అవుతుందిని వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం : ఈ కమిటీతో రైతుల్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తుందని కేటీఆర్ అన్నారు. రైతాంగానికి మేలు చేయాలన్న ఆలోచన తప్ప ఇందులో రాజకీయ ఆలోచన లేదని ఉద్ధాటించారు. రైతు డిక్లరేషన్, రుణమాఫీ, మద్దతు ధరలను పరిశీలిస్తామని, ప్రధాన ప్రతిపక్షంగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని పెర్కోన్నారు. అలాగే ఇదే నివేదికను బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు ఇస్తామని అన్నారు. రేషన్ కార్డులపై కాంగ్రెస్‌లాగా మేం ప్రచారం చేయలేదని, రాష్ట్రంలో హోంమంత్రి లేరు, శాంతి భద్రతలు లేవని ఆయన విమర్శించారు.
"రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వల్ల రైతులు నిరాశ, నిస్పృహలకు లోనయ్యారు. రైతుల కష్టాలు తెలుసుకొని, రైతులకు అండగా ఉండాలని పార్టీ తరపున బీఆర్‌ఎస్ రైతు కమిటీని ఏర్పాటు చేశాం. ఈ కమిటీ మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నేతృత్వంలో నెలరోజుల పాటు రాష్ట్రమంతటా పర్యటిస్తుంది. రైతు డిక్లరేషన్, రుణమాఫీ, మద్దతు ధరలను పరిశీలిస్తాం. రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు నివేదిక ఇస్తాం."- కేటీఆర్, బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామసభలపై ప్రజలు భగ్గుమంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వం ఇలాగే చేస్తే తిరగబడతారని హెచ్చరించారు. రేషన్ కార్డు ఇవ్వడం కూడా దైవకార్యంగా కాంగ్రెస్ తీరు ఉందని ఆక్షేపించారు. జీహెచ్ఎంసీ మేయర్‌పై అవిశ్వాసం పెడతారా అన్న ప్రశ్నకు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని ఆయన వ్యాఖ్యానించారు.
బైట్ - కె.టి.రామారావు, బి.ఆర్.ఎస్. కార్యనిర్వాహక అధ్యక్షుడు
'రైతుబంధు పంపిణీలో అవినీతి జరిగితే విచారణ జరిపించండి'
'కాంగ్రెస్ హైకమాండ్‌కు తెలిసే - తెలంగాణలో దోపిడీ, మోసాలు జరుగుతున్నాయి'