ETV Bharat / entertainment

నడవలేని పరిస్థితిలో రష్మిక - వీల్​ఛైర్ సాయంతో ఎయిర్​పోర్ట్​లోకి! - ఏమైందంటే?​ - RASHMIKA MANDANNA INJURY

వీల్‌ఛైర్‌లో రష్మిక- ఫ్యాన్స్ ఆందోళన- ఏం జరిగిందో? ఏంటో?

Rashmika Mandanna Injury
Rashmika Mandanna (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 22, 2025, 12:17 PM IST

Rashmika Mandanna Injury : జిమ్‌లో వర్కౌట్లు చేస్తుండగా కాలికి గాయమైందని స్టార్ హీరోయిన్ రష్మిక ఇటీవలె తన అభిమానులకు తెలిపింది. అయితే తాజాగా ఆమె హైదరాబాద్‌ ఎయిర్​పోర్ట్​లో కనిపించింది. స్టాఫ్ సాయంతో ఆమె చాలా ఇబ్బందిగా నడుచుకుంటూ వీల్‌ఛైర్‌ ఎక్కి ఎయిర్​పోర్ట్​లోకి వెళ్లింది. తన ఫేస్​ను మొత్తం ఆమె కవర్​ చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. అయితే ఆమె తన అప్​కమింగ్ మూవీ ప్రమోషన్స్​ కోసం ముంబయి బయల్దేరినట్లు సమాచారం.

ఇక ఈ వీడియో చూసి రష్మిక ఫ్యాన్స్ మరింత ఆందోళన చెందుతున్నారు. ఆమె గాయం మాని త్వరగా కోలుకోవాలంటూ నెట్టింట కామెంట్స్‌ పెడుతున్నారు. ఇటువంటి సమయంలో రెస్ట్ తీసుకోకుండా తను ఎంతో డెడికేషన్​తో ప్రమోషన్స్​కు వెళ్తోందని అంటున్నారు.

ఇంతకీ ఏమైందంటే?
తనకు ఇటీవలే గాయమైనట్లు రష్మిక సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ షేర్ చేసింది. ఆ దెబ్బ మానడానికి ఎంత సమయం పడుతుందో తెలియదని చెప్పుకొచ్చింది. "నేను పూర్తిగా ఎప్పుడు కోలుకుంటానో ఆ భగవంతుడికే తెలియాలి. త్వరగా కోలుకుని 'సికందర్‌', 'థామ', 'కుబేర' షూటింగ్స్​లో పాల్గొనాలని కోరుకుంటున్నాను. ఈ ఆలస్యానికి నన్ను క్షమించాలంటూ ఆ మూవీ డైరెక్టర్స్​ను కోరుతున్నా. నా కాలు ఏమాత్రం సెట్‌ అయినా సరే వెంటనే సెట్స్​లోకి వచ్చేస్తాను" అని తెలిపారు.

Rashmika Upcoming Movies : ఇక రష్మిక చేతిలో ప్రస్తుతం దక్షిణాదితో పాటు బాలీవుడ్​కు సంబంధించిన భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. 'ధనుశ్'​తో కుబేరా, 'విక్కీ కౌశల్​తో 'ఛావా', సల్మాన్ ఖాన్​తో 'సికందర్‌', అలాగే తెలుగులో 'ది గర్లఫ్రెండ్‌' చిత్రాల్లో ఆమె నటిస్తోంది. తాజాగా 'ఛావా' టీమ్​ రష్మిక రోల్​ను పరిచయం చేస్తూ ఓ స్పెషల్ పోస్టర్​ను షేర్ చేసింది. అందులో ఆమెను ఏసు బాయ్​గా చూపించారు. నిండా నగలతో ఫుల్ మరాఠి ట్రెడిషన్​లో రష్మిక లుక్ అదిరిపోయిందని ఫ్యాన్స్ అంటున్నారు. మడాక్‌ ఫిల్మ్స్‌ పతాకం పై దినేశ్‌ విజన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 14న థియేటర్లలో సందడి చేయనుంది.

'నిజంగా సారీ, అలా చెప్పినందుకు' - విజయ్​, మహేశ్ సినిమాపై రష్మిక కామెంట్స్!

ఆసక్తికరంగా 'ది గర్ల్‌ ఫ్రెండ్‌' టీజర్ - విజయ్ దేవరకొండ వాయిస్​తో!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.