Saif Ali Khan Attack : బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ తనపై జరిగిన దాడి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అయితే దాడి జరిగిన రాత్రి తాను హాస్పిటల్‌కు వెళ్లేందుకు సహాయం చేసిన ఆటోడ్రైవర్ భజన్ సింగ్ రాణాను ఆయన కలిశారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కావడానికి ముందు సైఫ్ అతడిని కలిసి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.
క్లిష్ట సమయంలో తనకు సహాయం చేసినందుకు భజన్‌సింగ్‌కు సైఫ్ కృతజ్ఞతలు తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటో తాజాగా బయటకు వచ్చింది. అయితే సాయం చేసిన డ్రైవర్‌ను గుర్తు పెట్టుకుని మరీ అతడికి థాంక్స్ చెప్పడంతో సైఫ్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోవైపు సైఫ్ తల్లి షర్మిలా ఠాగూర్ సైతం డ్రైవర్ సాయాన్ని మెచ్చుకున్నారు. ఆయనకు ధన్యవాదాలు చెప్పారు.
Mumbai, Maharashtra: Bhajan Singh Rana, the auto driver who took actor Saif Ali Khan to the hospital after he was attacked, met the actor after he was discharged from the hospital yesterday.
— IANS (@ians_india) January 22, 2025
Auto driver Bhajan Singh Rana says, " ...they gave a time of 3:30 pm, i said okay, and i… pic.twitter.com/knmztnk9E4
సైఫ్‌పై దాడి జరిగిన తర్వాత భజన్‌సింగ్ రాణా గురించి వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అతడు మీడియాతో మాట్లాడాడు. ఆ రోజు రాత్రి ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఏం జరిగిందో వివరించారు. 'ఆరోజు జరిగింది నాకు బాగా గుర్తుంది. నేను అటునుంచి వెళ్తున్న సమయంలో ఒక మహిళ లగ్జరీ ఇంటి గేటు బయట నిల్చొని ఉన్న మహిళ నన్ను చూసి ఆటో ఆపమని కోరింది. సైఫ్‌ను చూడగానే నేను వెంటనే గుర్తు పట్టలేదు. ఆటోలో ఎక్కిన తర్వాతే ఆయన సైఫ్ అని తెలిసింది. ఆయనతోపాటు ఓ పిల్లాడు, మరో వ్యక్తి ఆటోలో ఎక్కారు'
'ఆటో ఇంటి నుంచి స్టార్ట్ అవ్వగానే, 'ఇంకెంత టైం పడుతుంది?' అని సైఫ్ నన్ను అడిగారు. 10 నిమిషాల్లోనే మేము హాస్పిటల్‌కు చేరుకున్నాం. ఆయన ధరించిన తెల్ల కుర్తా ఎరుపు రంగులోకి మారిపోయింది. అప్పటికి చాలా రక్తం పోయింది. ఆయనను ఆస్పత్రి వద్ద దించాను. ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఆ సమయంలో ఆయనకు సాహాయం చేసినందుకు సంతోషించా' అని డ్రైవర్ భజన్‌సింగ్ తెలిపారు.
ఇదీ జరిగింది
జనవరి 16న సైఫ్‌పై ఓ దుండగుడు దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో సైఫ్ వెన్నెముకకు తీవ్రగాయమైంది. సర్జరీ చేసిన వైద్యులు వెన్నెముక నుంచి కత్తిని తొలగించారు. ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఆయన మంగళవారం డిశ్ఛార్జి అయ్యారు. మరోవైపు, ఈ కేసు విషయమై ముమ్మరంగా దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌ను అరెస్టు చేశారు. ప్రస్తుతం అతడు కస్టడీలో ఉన్నాడు.
సైఫ్ కోసం మేకర్స్ వెయిటింగ్!- సెట్స్‌లోకి ఎప్పుడు అడుగుపెట్టనున్నారంటే?
ఆస్పత్రి నుంచి సైఫ్ అలీ ఖాన్ డిశ్చార్జ్ - వారంపాటు బెడ్ రెస్ట్