ETV Bharat / offbeat

"కొత్తిమీర నిల్వ పచ్చడి" - ఇలా చేస్తే వారెవ్వా! - కనీసం 6 నెలలు నిల్వ! - KOTHIMEERA NILAVA PACHADI

- అన్నం, టిఫెన్స్​లోకి అదుర్స్ - సింపుల్​గా ప్రిపేర్ చేసుకోండిలా!

How to Make Kothimeera Pachadi
Kothimeera Nilava Pachadi Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 22, 2025, 6:19 PM IST

Kothimeera Nilava Pachadi Recipe : దాదాపు ప్రతి ఇంట్లోనూ కొత్తిమీర లేకుండా కర్రీ వండలేని పరిస్థితి. ఇక నాన్​వెజ్ వంటకాల్లో అయితే తప్పనిసరిగా ఉండాల్సిందే. దాని సువాసన తగలకపోతే ఏదో వెలితిగా ఫీలవుతుంటారు. అలాంటి కొత్తిమీరతోనే నిల్వ పచ్చడి పెట్టుకోవచ్చని మీకు తెలుసా? చాలా రుచికరంగా ఉండడమే కాదు, కనీసం 6 నుంచి 7 నెలలు ఉంటుంది! మరి, ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానమేంటో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • కొత్తిమీర - 1 పెద్దకట్ట
  • చింతపండు - పావు కప్పు (90 గ్రాములు)
  • మెంతులు - ఒకటిన్నర స్పూన్లు (9 గ్రాములు)
  • ఆవాలు - 3 స్పూన్లు (23 గ్రాములు)
  • నూనె - అర కప్పు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • పసుపు - పావు చెంచా
  • కారం - తగినంత

తాలింపు కోసం :

  • ఆయిల్ - అర కప్పు
  • శనగపప్పు - ఒకటిన్నర స్పూన్లు
  • పొట్టు మినప్పప్పు - ఒకటిన్నర స్పూన్లు
  • జీలకర్ర - ఒక స్పూన్
  • ఆవాలు - ఒక స్పూన్
  • వెల్లుల్లి పాయ -1
  • ఎండుమిర్చి - 4
  • కరివేపాకు - కొద్దిగా

టేస్టీ టమాటా కొత్తిమీర పచ్చడి- వేడి వేడి అన్నంలో అయితే వేరే లెవల్​!

తయారీ విధానం :

  • ముందుగా కొత్తిమీర వేర్లు కట్ చేసుకోవాలి. ఆపై మరీ సన్నగా కాకుండా కాస్త పెద్దగానే కాడలతో సహా తరుక్కొని ఒక బౌల్​లోకి తీసుకోవాలి.
  • ఆ తర్వాత కొత్తిమీర తరుగును శుభ్రంగా కడిగి ఫ్యాన్ కింద కాటన్​ క్లాత్​పై పల్చగా పరచి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఎందుకంటే తడిగా ఉంటే పచ్చడి త్వరగా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది.
  • ఆ విధంగా కొత్తిమీరను పూర్తిగా ఆరబెట్టుకున్నాక, దాన్ని ఏదైనా చిన్న గిన్నెతో కొలుస్తూ మరో గిన్నెలో వేసుకోవాలి. ఎందుకంటే ఆ కొలతతోనే మిగతా ఇంగ్రీడియంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మేము చెబుతున్న కొత్తిమీర 5 చిన్న బౌల్స్ (250 గ్రాములు) కోసం.
  • ఇప్పుడు అదే కప్పుతో ఒక చిన్న బౌల్​లో చింతపండును తీసుకొని గింజలు, పీచు వంటివి లేకుండా శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత అందులో వేడినీరు పోసి గంటపాటు నానబెట్టుకోవాలి.
  • నానబెట్టుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి అందులోని పిప్పిని వేరు చేసి మరీ పల్చగా, చిక్కగా కాకుండా చింతపండు గుజ్జును రెడీ చేసుకొని పక్కనుంచాలి.
  • అనంతరం స్టౌపై పాన్ పెట్టుకొని మెంతులు, ఆవాలు వేసుకొని లో-ఫ్లేమ్ మీద దోరగా వేయించుకోవాలి.
  • ఆపై వాటిని పూర్తిగా చల్లారాక మిక్సీ జార్​లో వేసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు అదే పాన్​లో పావుకప్పు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక ఆరబెట్టి పక్కన పెట్టుకున్న కొత్తిమీర తరుగును వేసి మీడియం ఫ్లేమ్ మీద మధ్యమధ్యలో కలుపుతూ చక్కగా వేయించుకోవాలి. కొత్తిమీర ఎంత బాగా వేగితే పచ్చడి అంత రుచికరంగా ఉంటుంది.
  • కొత్తిమీర రంగు మారి బాగా వేగిందనుకున్నాక దాన్ని ఒక ప్లేట్​లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అందులో మరో పావు కప్పు నూనె వేసి వేడి చేసుకోవాలి.
  • ఆయిల్ వేడయ్యాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు గుజ్జు, ఉప్పు, పసుపు వేసి కలిపి మీడియం ఫ్లేమ్ మీద మిశ్రమం కాస్త దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఆ విధంగా ఉడికించుకున్న తర్వాత స్టౌ ఆఫ్ చేసి, మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.

కొత్తిమీర త్వరగా వాడిపోతోందా ? - ఇలా స్టోర్​ చేస్తే వారం రోజులపైనే ఫ్రెష్​గా ఉంటుంది!

  • ఈలోపు తాలింపు సిద్ధం చేసుకోవాలి. ఇందుకోసం స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడెక్కాక శనగపప్పు, పొట్టు మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి.
  • అవి వేగాక కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి వేపుకోవాలి. ఆ తర్వాత ఎండుమిర్చి తుంపలు, కరివేపాకు వేసుకొని వేయించుకున్నాక స్టౌ ఆఫ్ చేసి పాన్​ను దించుకొని పూర్తిగా చల్లారనివ్వాలి.
  • ఈలోపు పచ్చడిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం మిక్సీ జార్​ తీసుకొని వేయించుకున్న కొత్తిమీర తరుగు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత దాన్ని ఒక మిక్సింగ్ బౌల్​లోకి తీసుకొని అందులో చల్లారిన చింతపండు మిశ్రమం, మిక్సీ పట్టుకున్న మెంతుల పొడి, కారం వేసుకొని అన్నీ కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి.
  • అనంతరం చల్లారిన పోపునూ యాడ్ చేసుకొని మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆపై ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే "కొత్తిమీర నిల్వ పచ్చడి" రెడీ!
  • ఈ పచ్చడి మామూలుగా బయట ఉంచితే కనీసం 2 నెలల వరకు నిల్వ ఉంటుంది! అదే ఫ్రిజ్​లో ఉంచితే కనీసం 6 నుంచి 7 నెలల వరకు నిల్వ ఉంటుందట. దీన్ని అన్నం, టిఫెన్స్, చపాతీ ఇలా దేనిలోకి తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది.

టేస్టీ "కొత్తిమీర పులావ్​" - ఇలా చేసి పెడితే పిల్లల లంచ్​బాక్స్​లు ఇట్టే ఖాళీ అయిపోతాయ్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.