ETV Bharat / health

'జీరా వాటర్ తాగితే షుగర్ కంట్రోల్'- ఇంకా బరువు కూడా తగ్గుతారని పరిశోధనలో వెల్లడి - JEERA WATER IN THE MORNING BENEFITS

-పరగడపున జీరా నీళ్లు తాగితే అనేక ప్రయోజనాలు -గుండె నుంచి చర్మ సమస్యల వరకు పరిష్కారం!

benefits of jeera water for diabetes
benefits of jeera water for diabetes (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : Jan 22, 2025, 5:22 PM IST

Jeera Water Benefits for Weight Loss: ప్రస్తుతం షుగర్, అధిక బరువు సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. ఇలాంటి వారు జీలకర్రను రాత్రంతా నీటిలో నానబెట్టి ఆ నీటిని మరుసటి రోజు పరగడుపున తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫలితంగా బరువు తగ్గడమే కాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుందని.. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పరగడుపున జీరా నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

జీరా వాటర్ రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచి మధుమేహం ఉన్నవారికి చక్కని ఉపశమనం లభించేలా చేస్తుందని అంటున్నారు. 2018లో Journal of Medicinal Foodలో ప్రచురితమైన "Effect of cumin (Cuminum cyminum) on metabolic syndrome parameters in patients with type 2 diabetes: a randomized double-blind placebo-controlled trial" అనే అధ్యయనంలో ఈ విషయం తేలింది. (రిపోర్ట్ కోసం ఇక్కడ్ క్లిక్ చేయండి)

  • రాత్రంతా నానబెట్టిన జీరా నీటిని నిమ్మరసం కలిపి పరగడపున తాగాలని చెబుతున్నారు. ఇలా చేస్తే శరీరంలోని టాక్సిన్లు బయటికి పోయి, పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కరుగుతుందని అంటున్నారు.
  • మెటబాలిజాన్ని పెంచడంలో జీరా సాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో ఉన్న కేలరీలను కరిగించి బరువు తగ్గడంలో సాయపడతుందని అంటున్నారు. బరువు తగ్గాలనుకునేవారు పరగడుపున జీరా వాటర్ తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
  • జీరాలో థైమోల్ పుష్కలంగా ఉంటుందని.. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి కడుపు ఉబ్బరం, అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తుందని చెబుతున్నారు.
  • జీలకర్రలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు.. ఫ్రీ రాడికల్స్​తో పోరాడి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయని చెబుతున్నారు. వృద్ధాప్య ఛాయల్ని తగ్గించి కాంతిమంతంగా కనిపించేలా చేస్తాయని వివరిస్తున్నారు. అలాగే జుట్టు కుదుళ్లు బలంగా, ప్రకాశవంతంగా తయారవుతాయని అంటున్నారు.
  • ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో మెండుగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని అంటున్నారు.
  • జీరాలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు శ్వాసకోశ సంబంధిత సమస్యలను తగ్గిస్తాయని చెబుతున్నారు.
  • ఉదయాన్నే ఖాళీ కడుపుతో గ్లాసు జీరా వాటర్ తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేట్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. కిడ్నీల ఆరోగ్యానికి దోహదపడుతుందని అంటున్నారు.
  • జీరా నీళ్లు పరగడుపున తాగడం వల్ల గుండె ఆరోగ్యం బాగుంటుందని చెబుతున్నారు. శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్​ను తగ్గించి.. హృదయ సంబంధిత వ్యాధుల ముప్పును అరికడుతుందని వివరిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఈ నూనె రాస్తే కీళ్ల నొప్పులు తగ్గిపోయే ఛాన్స్! వంటల్లో వాడితే గుండెకు మంచిదట!

నీళ్లు తాగకపోతే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? అసలు వాటర్ ఎందుకు తాగాలి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.