ETV Bharat / entertainment

'మీర్జాపూర్‌ 3' టు 'మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌'- భారత్​లో హైయెస్ట్ వ్యూస్​ అందుకున్న సిరీస్​లివే! - ORMAX MEDIA TOP WEB SERIES

భారత్‌లో అత్యధికమంది వీక్షించిన వెబ్​ సిరీస్​లు - టాప్​లో తెలుగు

Ormax Media Top Web Series
Ormax Media Top Web Series (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 22, 2025, 8:05 AM IST

Most Viewed Web Series In India 2024 : పేరుకు హిందీ సిరీస్ అయినా దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యింది 'మీర్జాపూర్‌ 3'. 2024లో వచ్చిన ఈ సిరీస్​ ఆ ఏడాది అత్యధికంగా వీక్షించిన కంటెంట్​గా రికార్డు సృష్టించింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా అందుబాటులో ఉన్న ఈ సిరీస్‌ను దాదాపు 30.8 మిలియన్ల మంది చూశారని ఓ సర్వేలో తేలింది. ఓటీటీ కంటెంట్‌ను విశ్లేషించే ఆర్‌మ్యాక్స్‌ మీడియా తాజా తమ నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. అంతేకాదు, వివిధ ఓటీటీ వేదికల్లో అత్యధిక వ్యూవర్​షిప్ సాధించిన వెబ్‌సిరీస్‌లు, సినిమాలకు సంబంధించిన వివరాలనూ ఆ సంస్థ వెల్లడించింది. అవేంటో చూద్దాం.

ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ లవర్స్​ను ఆకట్టుకుని అనతికాలంలోనే పాపులర్ అయిన వెబ్‌సిరీస్‌ల్లో 'స్క్విడ్‌ గేమ్‌2' ఒకటి. 2024 డిసెంబర్​లో నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్​ అయిన ఈ సిరీస్‌ స్ట్రీమింగ్​కు వచ్చిన కొద్ది రోజుల్లోనే రికార్డులు తిరగరాసింది. ఇప్పటివరకూ 'మనీ హెయిస్ట్‌' పేరిట ఉన్న వ్యూవర్​షిప్​ను దాటేసింది. అంతేకాకుండా భారత్‌లోనూ ఈ సిరీస్‌ బాగానే పాపులర్ అయ్యిందని ఆర్‌మ్యాక్స్‌ తమ నివేదికలో తెలిపింది.

ఇండియాలో ఆ వెబ్‌సిరీస్‌లదే హవా!
భారతీయ ఓటీటీ ఇండస్ట్రీలో ముఖ్యంగా హిందీ బెల్ట్‌లో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌ వీడియోల హవా కొనసాగుతోంది. ఎంతలా అంటే టాప్‌-15 ఒరిజినల్​ సిరీస్​లుఈ వేదికలగానే స్ట్రీమింగ్‌ అవుతూ అలరిస్తున్నాయి. ఈ క్రమంలో ఇండియాలో 'మీర్జాపూర్‌ 3' తర్వాత అత్యధికంగా 'పంచాయత్‌3' సిరీస్​ను ప్రజలు వీక్షించినట్లు తెలుస్తోంది. 28.2 మిలియన్ల మంది 'పంచాయత్ 3'ని ఆదరించారు. ఈ రెండింటి తర్వాత 21.5 మిలియన్‌ వ్యూవర్స్‌తో 'హీరామండి: ది డైమండ్‌ బజార్‌' మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది.

ఇదిలా ఉండగా, నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చిన సినిమాల్లో టాప్‌-15లో 11 చిత్రాలు నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చినవే కావటం విశేషం. వీటిలో 'దోపత్తి'(15.1 మిలియన్‌), 'సెక్టార్‌ 36' (13.9మిలియన్‌) 'సికిందర్‌ కా ముకద్దార్‌' (13.5మిలియన్‌) ఉన్నాయి.

ఇక 2024లో అత్యధిక మంది లైక్‌ చేసిన సిరీస్‌గా 'పంచాయత్‌3' నిలిచింది. అలాగే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న ‘మహారాజ’ చిత్రాన్ని ఎక్కువ మంది ప్రేక్షకులు ఇష్టపడ్డారు.

రీజనల్ లాంగ్వేజస్​లో అవే టాప్​!
ఇదిలా ఉండగా, హిందీనే కాకుండా పలు రీజనల్ భాషల్లోనూ విడుదలైన సిరీస్​లను చూసేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు ఆర్‌మ్యాక్స్‌ నివేదిక తెలిపింది. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో డిస్నీ+హాట్‌స్టార్‌ టాప్‌ పొజిషన్​ను సొంతం చేసుకుంది. 'సేవ్‌ ది టైగర్స్‌: సీజన్‌2'ను 5 మిలియన్​ వ్యూవ్స్​తో టాప్​లో ఉండగా, సుమారు 4.9 మిలియన్‌ వ్యూవ్స్​తో బుజ్జి అండ్‌ భైరవ రెండో స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ రిషి అనే తమిళం సిరీస్​ కూడా అత్యధిక వ్యూవ్స్​తో టాప్‌లో ఉంది.

మరోవైపు ప్రాంతీయంగానూ ఇంటర్నేషనల్‌ కంటెంట్‌ చూసే వారి సంఖ్య భారీగానే ఉందని తెలుస్తోందని ఆ నివేదికలో పేర్కొంది. 'హౌస్‌ ఆఫ్ డ్రాగన్‌2', 'స్క్విడ్‌ గేమ్‌2', 'రోడ్‌ హౌస్‌' లాంటి సిరీస్​లకు ఇక్కడ విశేష ఆదరణ లభించింది. ఇక ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న #90's ఎ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్​ అత్యధికమంది ఇష్టపడిన సిరీస్‌గా నిలిచినట్లు తెలిపింది. అత్యధిక రేటింగ్‌ కూడా ఈ సిరీస్​ సొంతం చేసుకున్నట్లు ఆర్‌మ్యాక్స్ మీడియా తమ నివేదికలో వెల్లడించింది.

షారుక్, సల్మాన్​ను బీట్ చేసిన ప్రభాస్, బన్నీ- ఇండియా నెం 1హీరో మన డార్లింగే!

మోస్ట్​ పాపులర్ స్టార్స్​ - ఫస్ట్ ప్లేస్​లో సామ్, ప్రభాస్‌!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.