Saif Ali Khan Upcoming Movies : ఇటీవలె తన నివాసంలో దుండగుడు చేతిలో గాయపడ్డ బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ తాజాగా డిశ్చార్జ్ అయ్యారు. ప్రముఖ లీలావతి ఆస్పత్రిలో ఆరు రోజుల పాటు చికిత్స తీసుకుని ఆయన మంగళవారం బయటకు వచ్చారు. నెమ్మదిగా గాయల నుంచి కోలుకుంటున్న ఆయన్ను డాక్టర్లు వారం పాటు బెడ్‌రెస్ట్ సూచించారు.
ఇదిలా ఉండగా, ప్రస్తుతం ఆయన చేతిలో పలు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. బాలీవుడ్లోనే కాకుండా తెలుగులోనూ ఆయన చేయాల్సిన సినిమాలు. ముఖ్యంగా 'దేవర' మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న 'దేవర 2' ఆయనది కీలక పాత్ర. దీంతో ఆయన త్వరగా కోలుకుని తిరిగి రావాలని మూవీ టీమ్ కోరుతోంది. అయితే ఇంకా ఈ సినిమాకు సంబంధించిన వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు.
మరోవైపు హెయిస్ట్ డ్రామా నేపథ్యంలో రాబీ గ్రూవెల్ తెరకెక్కిస్తోన్న 'జ్యువెల్ థీఫ్: ది రెడ్ సన్ ఛాప్టర్'లోనూ సైఫ్ నటించన్నారు. దీంతో పాటు ఆయన చేతిలో మార్ఫిక్స్ పిక్చర్స్ పతాకంపై 'పఠాన్' డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించనున్న సినిమా కుడా ఉంది. అలాగే 'భక్షక్' ఫేమ్ డైరెక్టర్ పుల్కిత్ రూపొందించనున్న 'కర్తవ్య'లోనూ సైఫ్ మెరవనున్నారు.
ఇవే కాకుండా యాక్షన్ థ్రిల్లర్‌గా విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్న 'రేస్' ఫ్రాంచైజీలోనూ సైఫ్ మరోసారి భాగం కానున్నారు. 'రేస్ 4'లో ఆయన కీలక పాత్రలో కనిపించనున్నట్లు మూవీ టీమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రమేశ్ తౌరానీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వీటితో పాటు పలువురు టాప్ డైరెక్టర్ల చిత్రాలు కూడా చర్చల దశలో ఉన్నాయి.
అయితే ప్రస్తుతం సైఫ్ ఉన్న పరిస్థితిలో ఆయనకు బెడ్ రెస్ట్ ఎంతో అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. తన గాయలకు ఇన్ఫెక్షన్ కాకుండా జాగ్రత్తపడాలని అంటున్నారు. దీంతో ఆయన ఇప్పట్లో సినిమాల్లోకి వచ్చే అవకాశాలు ఉండేలా లేవని సినీ వర్గాల సమాచారం. ఈ క్రమంలో మేకర్స్‌తో పాటు సైఫ్ అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. పూర్తిగా ఫిట్నెస్ సాధించి తిరిగి సినిమాల్లో రాణించాలని ఆశిస్తున్నారు.
ఆ వ్యక్తి ఏమీ దొంగిలించలేదు - బాబు దగ్గరికి దుండగుడిని రానివ్వకుండా సైఫ్ కాపాడాడు
సైఫ్ గురించి తెలియక అలా అనేశాను, ఆయన క్షమిస్తారని అనుకుంటున్నా : ఊర్వశీ రౌతేలా