This Week OTT/Theatre Releases : ఈ వారం థియేటర్లలో పలు ఆసక్తికర క్రేజీ సినిమాలు రిలీజ్‌కు రెడీ అయ్యాయి. అందులో ముఖ్యంగా నేచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిందీ చిత్రం(Saripoda Sanivaram). ఎస్‌జే సూర్య విలన్‌గా నటించారు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్. ఈ సినిమా ఆగస్టు 29న రిలీజ్ కానుంది. మిగిలిన రోజుల్లో సాదాసీదాగా ఉంటూనే శనివారం మాత్రమే తన కోపాన్ని చూపించే వ్యక్తిగా హీరో పాత్ర చూపించనున్నారు. యాక్షన్‌తో పాటు కామెడీ ఈ సినిమాలో ఉండనున్నట్లు ప్రచార చిత్రాలు చూస్తుంటే అర్థమవుతోంది.
- మగధీర ఫేమ్ విలన్ దేవ్ గిల్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ అహో! విక్రమార్క (Aho Vikramaarka Movie) ఆగస్టు 30న రిలీజ్ కానుంది. త్రికోటి దర్శకుడు. సినిమాలో దేవ్‌గిల్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు.
- మాస్, దమ్ముంటే కాస్కో అంటూ మరోసారి థియేటర్లలో సందడి చేయనున్నారు హీరో నాగార్జున. 2004 లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన ఈ మాస్ మసాలా చిత్రం నాగ్ పుట్టినరోజు సందర్భంగా రీరిలీజ్‌కు సిద్ధమైంది. ఆగస్టు 29న నాగార్జున పుట్టినరోజున విడుదల కానుంది.
ఇంకా ఈ వారం ఓటీటీలో వచ్చే సినిమా/సిరీస్‌లివే!
నెట్‌ఫ్లిక్స్‌లో
చరిత్రలోనే అతిపెద్ద కాంధార్ హైజాక్‌ను ఆధారంగా IC 814 The Kandahar Hijack సిరీస్‌ను రూపొందించారు. ఆగస్ట్ 29 నుంచి ఇది స్ట్రీమింగ్ కానుంది.
ఇంకా నెట్‌ఫ్లిక్స్‌లో
- బ్రీత్‌లెస్ (వెబ్‌సిరీస్) ఆగస్టు 30
- ది డెలివరెన్స్ (వెబ్‌సిరీస్) ఆగస్టు 30
- అల్లు శిరీష్ బడ్డీ ఆగస్ట్ 30
జీ5లో
- ముర్షిద్ (హిందీ సిరీస్) ఆగస్టు 30