Pushpa 2 Ticket Price : ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ 'పుష్ప 2' సినిమా టికెట్ ధరలు పెంపునకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుకుమార్ తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం డిసెంబర్ 5న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో రెండు బెనిఫిట్ షో లకు ప్రభుత్వం అనుమతించింది. డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటలకు తొలి బెనిఫిట్ షోతో పాటు, అర్ధరాత్రి 1 గంటలకు రెండో షో పడనుంది. అయితే ఈ బెనిఫిట్ షోల టికెట్ ధరను రూ.800 పెంచుకునేందుకు ప్రభుత్వం వీలుకల్పించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్ ఏదైనా సరే ఇప్పుడున్న ధరకు అదననంగా రూ.800 చెల్లించాల్సిందే. అంటే బెనిఫిట్ షోకు టికెట్ ధర సింగిల్ స్క్రీన్స్‌లో సుమారు రూ. 1000, మల్టీప్లెక్స్‌లలో రూ.1200 పైగా అవుతోంది.
ఇక అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు అదనపు షోలకు కూడా అనుమతి లభించింది. డిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్‌లలో రూ.150, మల్టీఫ్లెక్స్‌లో రూ.200 పెంచారు. డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.105, మల్టీఫ్లెక్స్‌లో రూ.150 పెంపునకు అనుమతి ఇచ్చారు. ఇక డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.20, మల్టీఫ్లెక్స్‌లో రూ.50 పెంపునకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ,తెలంగాణలో ప్రీ బుకింగ్స్ శనివారం సాయంత్రం 4.53 నిమిషాలకు ప్రారంభం కానున్నట్లు మేకర్స్ అఫీషియల్‌గా తెలిపారు. ఇక ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా 12వేలకుపైగా స్క్రీన్లలో విడుదల కానుంది.
Telangana Bookings for THE BIGGEST INDIAN FILM will open today at 4.56 PM 💥💥#Pushpa2TheRule bookings exclusively on the @lifeindistrict app ❤️🔥
— Mythri Movie Distributors LLP (@MythriRelease) November 30, 2024
Stay tuned!
🎟️ https://t.co/tXZL9ZD90S#Pushpa2TheRuleOnDec5th
Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil… pic.twitter.com/lG5ItTcRSW
ఇక సినిమా విషయానికొస్తే, రష్మిక మంధన్నా హీరోయిన్గా నటించింది. డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడింది. సీనియర్ నటులు ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, అనసూయ, సునీల్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిచగా, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ సంయుక్తంగా నిర్మించారు.
'పుష్ప' రేంజ్ సెట్ చేసిన లేడీ గెటప్- జాతర సీన్ వెనుక కథేంటంటే?
'పుష్ప 2' తెలుగు ఈవెంట్ డేట్ ఫిక్స్- స్పెషల్ గెస్ట్ సుక్కూనే!