Massive Encounter : మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ములుగు జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఏటూరునాగారం మండలం చల్పాక అటవీ ప్రాంతంలో గ్రే హౌండ్స్, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టు కీలక నేతలు మృతి చెందినట్లు సమాచారం. మృతుల్లో మావోయిస్టు కీలక నేత బద్రు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలిలో భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్కౌంటర్లో బద్రు(35), మధు(43), కరుణాకర్(22), జైసింగ్(25), కిషోర్(22), కామేశ్(23), జమున(23) మృతి చెందినట్లు సమాచారం. ఎన్‌కౌంటర్‌పై పోలీసులు అధికారికంగా ధ్రువీకరించలేదు.
ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - ఏడుగురు మావోయిస్టుల మృతి
ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - ఏడుగురు మావోయిస్టులు మృతి - గ్రే హౌండ్స్, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు
Published : 3 hours ago
|Updated : 2 hours ago