తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

సినిమాల్లో సల్మాన్ లిప్ కిస్​ చేసిన ఒకే ఒక్క స్టార్ హీరోయిన్ ఎవరంటే? - SALMAN KHAN - SALMAN KHAN

Salman khan No Kiss Policy : నో కిస్ పాలసీని స్ట్రిక్ట్​గా ఫాలో అయ్యే సల్మాన్ ఒక్క సినిమాలో మాత్రం బ్రేక్ చేశారట. ఓ హీరోయిన్​ను మాత్రం లిప్ కిస్ పెట్టారట. కానీ తను ఐశ్వర్యరాయ్, కత్రినా కైఫ్, మాధురి దీక్షిత్ కాదు. ఇంతకీ తను ఎవరంటే?

Source Getty Images
Salman (Source Getty Images)

By ETV Bharat Telugu Team

Published : May 30, 2024, 7:58 PM IST

Salman khan No Kiss Policy : సల్మాన్ ఖాన్ అంటేనే గుర్తొచ్చేది సింగిల్ లైఫ్. ఆయన ఐశ్వర్యారాయ్ బచ్చన్, సంగీత బిజ్లానీ, కత్రినా కైఫ్ లాంటి హీరోయిన్లతో డేటింగ్‌ చేశారని, కానీ అవి ఫెయిల్ అవ్వడంతో పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారంటూ చాలా వార్తలు వినిపిస్తుంటాయి. రియల్ లైఫ్‌లో వినిపించే ఇలాంటి రూమర్స్​ ఎన్ని ఉన్నా సినిమాల్లో మాత్రం ఆయన లిప్ లాక్ సీన్లకు నో అంటూ కండీషన్‌ను చాలా స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతారట. అంతేకాదు స్క్రిప్ట్‌లో రొమాంటిక్‌ సీన్లు మితిమిరేలా ఉంటే వాటిని కచ్చితంగా తిరస్కరిస్తాని అప్పుడప్పుడు ప్రచారం సాగుతుంటుంది. అయితే ఇంత కఠినమైన పాలసీ ఫాలో అయ్యే సల్మాన్ భాయ్ తన కెరీర్‌లో ఒక్క సారి తన పాలసీని బ్రేక్ చేశారని ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. అయితే అది ఫేక్ అని ఇంకొందరు కొట్టిపారేస్తున్నారు.

ఆ వీడియో ఏంటంటే? - 1996లో రిలీజ్ అయిన 'జీత్' అనే సినిమాలో కరీనా కపూర్ అక్క, అప్పటి హీరోయిన్ కర్మిష్మా కపూర్ - సల్మాన్ ఖాన్ కలిసి నటించారు. అందులోనే సల్మాన్ ఆమెకు లిప్ కిస్ ఇచ్చారట. దానికి సంబంధించిన ఫొటో, వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు సల్మాన్ నో కిస్ పాలసీని ఎప్పుడో బ్రేక్ చేశారు అని అనడం మొదలుపెట్టారు. అదే సమయంలో మరికొంతమంది అది లిపి కిస్ కాదని, సల్మాన్ బుగ్గ మీద మాత్రమే కిస్ చేశారని చెబుతున్నారు. ఏదేమైనా ఆ చిత్రం తర్వాత సల్మాన్ ఏ హీరోయిన్‌తోనూ మితీమిరిన రొమాన్స్​ చేయలేదని తెలుస్తోంది.

కత్రినకు నో చెప్పిన సల్మాన్​ -సల్మాన్ లిప్ కిస్ చేయరని అంతమంది నమ్మకంగా వాదించడానికి కూడా కారణం లేకపోలేదు. అప్పట్లో సల్మాన్‌తో కత్రిన లవ్‌లో ఉందంటూ రూమర్లు వచ్చిన సమయంలోనే, అంటే 2017లో కత్రినా కైఫ్‌ను కిస్ చేయాలని డైరక్టర్ అలీ అబ్బాస్ జాఫర్ కోరారట. స్క్రిప్ట్‌లో ఉన్నట్లుగా చేయమని ఎంత అడిగినా దానికి సల్మాన్ స్మూత్‌గా నో చెప్పేశారట. ఈ విషయాన్ని డెక్కన్ క్రానికల్ అనే ఇంగ్లీష్ మీడియా రాసుకొచ్చింది. "కత్రినాను ఒక్కసారి కిస్ చేయాలని డైరక్టర్ అబ్బాస్ జాఫర్ కోరినప్పటికీ నో-కిస్సింగ్ అని సల్మాన్ చెప్పారట. ఏదోలా తిప్పలు పడి కిస్ చేసినట్లుగా చూపించాలని ఆ సీన్‌ను షూట్ చేసినా అది వర్కౌట్ కాకపోవడంతో ఫైనల్‌లో ఆ సీన్‌ను తొలగించారట" అని కథనాల్లో పేర్కొంది.

కాగా, సల్మాన్ ప్రస్తుతం తన కొత్త ప్రాజెక్ట్ 58వ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మంధానతో కలిసి నటిస్తున్నారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ముంబయితో పాటు విదేశాల్లో షూటింగ్ జరుపుకోబోతున్న ఈ సినిమాను రాబోయే రంజాన్ పండుగకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details