తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

పవర్​ఫుల్​గా రజనీ లోకేశ్ మూవీ టైటిల్ టీజర్ - డైలాగ్స్​, యాక్షన్​ మోడ్​ అదిరిందంటే! - Thalaivar 171 Title - THALAIVAR 171 TITLE

Rajinikanth Lokesh Kangaraj Thalaivar Movie 171 Title : లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రజనీ 171వ సినిమాగా ఇది రూపొందుతోంది. తాజాగా టైటిల్ గ్లింప్స్​ను రిలీజ్ చేశారు మేకర్స్.

రజనీ లోకేశ్ మూవీ టైటిల్ టీజర్ వచ్చేసింది
రజనీ లోకేశ్ మూవీ టైటిల్ టీజర్ వచ్చేసింది

By ETV Bharat Telugu Team

Published : Apr 22, 2024, 6:09 PM IST

Updated : Apr 22, 2024, 6:45 PM IST

Rajinikanth Lokesh Kangaraj Thalaivar Movie 171 Title :లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రజనీ 171వ సినిమాగా ఇది రూపొందుతోంది. ముందుగా చెప్పినట్టుగానే తాజాగా ఈ సినిమా టైటిల్ టీజర్​ను రివీల్ చేశారు మేకర్స్. మొదట తంగమ్‌, రాణా తదితర పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. కానీ ఇవి కాకుండా ఎవరూ ఉహించని విధంగా కూలి అనే టైటిల్​ను ఖరారు చేశారు మేకర్స్​. ఈ టైటిల్ గ్లింప్స్ ఆద్యంతం ఫైటింగ్ సీక్వెన్స్​తో అదిరిపోయింది. ఇందులో రజనీ స్టైల్ ఆటిట్యూడ్​ ఫైటింగ్​, డైలాగ్స్​ అదిరిపోయాయి. ఈ ప్రచార చిత్రం చూస్తుంటే బంగారం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్​లో ఈ మూవీ తెరకెక్కనుందని అర్థమవుతోంది.

కాగా, కోలీవుడ్​లో ఖైదీ, విక్రమ్​ వంటి బ్లాక్ బస్టర్లతో స్టార్ డైరెక్టర్​గా గుర్తింపు తెచ్చుకున్నారు లోకేశ్ కనగరాజ్. అయితే ఆయన చివరిగా తెరకెక్కించిన లియో సినిమా మాత్రం కాస్త మిక్స్​డ్​ టాక్​ తెచ్చుకుంది. దీంతో రజనీ 171 స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని సినిమాను తీర్చిదిద్దుతున్నారట.

"ఇదొక ప్రయోగాత్మక చిత్రం. ఇందులో రజనీ కాంత్‌ పాత్ర మునుపెన్నడూ చూడనివిధంగా ఉంటుంది. కాస్త నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో ఆయన కనిపించే ఛాన్స్​ ఉంది. ఇది పూర్తిస్థాయి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ. నా గత చిత్రాల్లో చూపించినట్లు మాదక ద్రవ్యాలను చూపించను" అని పేర్కొన్నారు.

కీలక పాత్రలో నాగార్జున - ఇకపోతే ఈ చిత్రం మల్టీస్టారర్​గా తెరకెక్కబోతోందని తెలుస్తోంది. ఇందులో టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున ఓ కీలక పాత్రని పోషిస్తున్నారని తమిళ సినీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. రీసెంట్​గానే లోకేశ్‌ కనగరాజ్‌ హైదరాబాద్‌కు వచ్చి నాగార్జునతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇంకా ఈ చిత్రంలో రజనీకాంత్‌కు కూతురు పాత్ర కోసం శ్రుతిహాసన్​ను తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. కాగా, నాగార్జున ఇప్పటికే ధనుశ్​తో కలిసి, శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో కుబేర చిత్రంలో నటిస్తున్నారు.

ఓటీటీలో వచ్చేసినా థియేటర్లలో తగ్గని హనుమాన్ క్రేజ్​ - 25 సెంటర్లలో 100 రోజులుగా! - Hanuman 100 Days

తగ్గిన టాలీవుడ్ బాక్సాఫీస్ జోరు - ఈ వారం థియేటర్​, OTTలో రాబోతున్న సినిమాలివే! - THIS WEEK MOVIE RELEASEs

Last Updated : Apr 22, 2024, 6:45 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details