ETV Bharat / entertainment

'దిల్‌ రూబా' టీజర్ రిలీజ్- లవ్ ఫెయిల్యూర్స్​ కోసం కూడా! - DILRUBA TEASER

కిరణ్ అబ్బవరం 'దిల్ రూబా' టీజర్ రిలీజ్- మీరు చూశారా?

Dilruba Teaser
Dilruba Teaser (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 3, 2025, 6:17 PM IST

Dilruba Teaser : యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం ఇటీవల 'క' సినిమాతో సూపర్‌ హిట్‌ అందుకున్నారు. ఇప్పుడు కొత్త సినిమా 'దిల్‌రూబా'తో అలరించడానికి సిద్ధమయ్యారు. మనసుని హత్తుకునే ప్రేమ కథతో డైరెక్టర్ విశ్వకరుణ్‌ దీన్ని తెరకెక్కిస్తున్నారు. శుక్రవారం ఈ సినిమా మేకర్స్​ టీజర్ రిలీజ్‌ చేశారు. కిరణ్‌ అబ్బవరం వాయిస్‌లో ప్రేమ కథను పరిచయం చేయడంతో మొదలైన టీజర్‌, వైలెంట్ యాక్షన్‌తో ఎండ్‌ అయింది. లవ్‌, సెంటిమెంట్‌, యాక్షన్‌తో ఇన్న ఈ టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.

టీజర్‌లో డైలాగులు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. హీరో తను మొదట మ్యాగీతో ప్రేమలో పడినట్లు చెబుతాడు. ఇక్కడ మ్యాగీ అంటే తినేదికాదు, అమ్మాయి పేరు. ఆమెతో విడిపోయాక జాన్‌, కింగ్‌ అనే ఇద్దరు పరిచయం అయ్యారని చెబుతాడు. ఇలా కిరణ్‌ అబ్బవరం నెరేషన్‌, బ్యూటిఫుల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ సాంగ్‌, అందమైన విజువల్స్‌తో టీజర్‌ మొదలవుతుంది. మ్యాగీతో మళ్లీ కలుస్తాడా? లేదా? అనుకునే సరికి మరో హీరోయిన్‌ పరిచయం అవుతుంది. మార్చిలో ఫెయిల్‌ అయిన స్టూడెంట్‌కి సెప్టెంబర్‌లో అవకాశం వచ్చినట్లు, హీరో లైఫ్‌లోకి అంజలి అనే పాత్ర ప్రవేశిస్తుంది. ఇక్కడ వరకు అందమైన సాంగ్‌, విజువల్స్‌, డైలాగులతో టీజర్‌ ప్రశాంతంగా ఉంటుంది.

ఆ తర్వాత సినిమాలోని మరో యాంగిల్‌ బటయపడుతుంది. అంజలి రాకతో హీరో జీవితం చాలా మలుపులు తిరుగుతుంది. ఆమె కోసం భారీ పోరాటాలే చేసినట్లు అర్థమవుతుంది. దీనికి కిరణ్‌ అబ్బవరం చెప్పే 'ప్రేమ చాలా గొప్పది. కానీ అది ఇచ్చే బాధే చాలా భయంకరంగా ఉంటుంది' అనే డైలాగ్‌ బలం చేకూరుస్తుంది. యాక్షన్‌ సీన్స్‌లో వినిపించే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా అద్భుతంగా ఉంది. చివరికి టీజర్‌ 'హిస్‌ లవ్‌, హిస్‌ యాంగర్‌' అనే క్యాప్షన్‌తో ఎండ్‌ అవుతుంది.

మొత్తానికి టీజర్‌లో కిరణ్‌ అబ్బవరం లుక్‌ కొత్తగా ఉంది. శ్వాగ్, యాటిట్యూడ్ కూడా సూట్‌ అయ్యాయి. అంజలి పాత్రలో నటించిన రుక్సార్ ధిల్లాన్‌తో కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. శ్యామ్‌ సీఎస్‌ మ్యూజిక్‌ అందించారు. ఈ మూవీని రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2025 ఫిబ్రవరిలో విడుదల కానుంది.

రెమ్యూనరేషన్ పెంచాలి కదా మరి!: కిరణ్ అబ్బవరం

ఈటీవీ విన్​లోకి 'క' మూవీ - స్ట్రీమింగ్​ ఎప్పుడంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.