ETV Bharat / entertainment

'మహానటి' సినిమాను ఫస్ట్ రిజెక్ట్ చేశా - ఆయన సపోర్ట్ వల్లే ఓకే చెప్పాను : కీర్తి సురేశ్​ - KEERTHY SURESH MAHANATI MOVIE

'మహానటి' సినిమాను ఫస్ట్ రిజెక్ట్ చేశాను : కీర్తి సురేశ్​

Keerthy Suresh Mahanati Movie
Keerthy Suresh (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 4, 2025, 10:44 AM IST

Keerthy Suresh Mahanati Movie : కొన్ని సినిమాలు నటులు కెరీర్‌ నే మార్చేస్తాయి. ఆ తర్వాత వారి కెరీర్ లో ఎన్ని హిట్స్ వచ్చినా, ఫ్లాప్స్ వచ్చినా ఆ ఒక్క సినిమా మాత్రం ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోతుంది. అలా కీర్తి సురేశ్ కెరీర్​లో మైల్​స్టోన్​లా నిలిచిన సినిమా 'మహానటి'. అప్పుడప్పుడే కెరీర్​ను ప్రారంభించిన కీర్తికి 'మహానటి' అనేది జాక్‌పాట్​లా తగిలింది. ఆ మూవీ తర్వాత చాలా మంది కీర్తి సురేశ్​ను మహానటి అని పిలవడం మొదలుపెట్టారు. ఆ రేంజ్​లో తనకు కీర్తికి ఆ సినిమా గుర్తింపును తెచ్చిపెట్టింది.

'మహానటి సినిమాను ఫస్ట్​ రిజెక్టు చేశా '
అయితే 'మహానటి' సినిమాను మొదట్లో తాను రిజెక్ట్ చేయాలనుకున్నానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు కీర్తి సురేశ్. దాని వెనుక ఉన్న కారణాన్ని కూడా చెప్పుకొచ్చారు. భయం కారణంగానే మహానటి సినిమాను వద్దనుకున్నానని తెలిపారు.

'పాజిటివ్​గా ఆలోచించలేకపోయాను'
"దర్శకుడు నాగ్ అశ్విన్ వచ్చి 4 గంటల పాటు మహానటి కథ చెప్పారు. అయితే నేను సినిమా చేయడానికి నో చెప్పేశాను. ఎవరో ఒక అమ్మాయి ఎక్కడి నుండో వచ్చి ఒక లెజెండ్​పై బయోపిక్ చేస్తే ప్రేక్షకులు అది చూసి నేను దానిని సరిగ్గా చేయలేదని చెప్తే ఎలా అనే అనుకున్నాను. పాజిటివ్​గా ఆలోచించలేకపోయాను. చాలా భయపడ్డాను. దీంతో సినిమాకు నో చెప్పాను." అని కీర్తి సురేశ్ చెప్పుకొచ్చారు.

'అప్పుడే ఓకే చెప్పా'
అయితే చిత్ర నిర్మాతలు, అలాగే డైరెక్టర్ నాగ్ అశ్విన్ తనను ఎంతో ప్రోత్సహించారని, తనపై వారు ఉంచిన కాన్ఫిడెన్స్ వల్లే 'మహానటి'కి ఓకే చెప్పానని పేర్కొన్నారు. "మనం సావిత్రమ్మ పర్సనల్ లైఫ్​ను చూపించాలి. కానీ అది సావిత్రి ఫ్యాన్స్‌కు నచ్చకపోతే ఎలా? దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే ఎలా? అని నేను ఆలోచిస్తున్నాను. నాగ్ అశ్విన్, నిర్మాతలు మాత్రం చాలా కాన్ఫిడెంట్​గానే ఉన్నారు. నా మీద నాకు లేని నమ్మకం నాగ్ అశ్విన్​కు ఉంది. అదే నన్ను మహానటి సినిమాను చేసేలా చేసింది." అని కీర్తి సురేశ్ తెలిపారు.

'మహానటి' కథ వినకముందే రిజెక్ట్​ చేసిన దుల్కర్​! మళ్లీ ఎందుకు నటించారు? నాగ్​ అశ్విన్ రివీల్!

''మహానటి'కి ఫిదా అయ్యా.. మీరూ చూడండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.