ETV Bharat / state

ఆరోగ్య శ్రీ ఆసుపత్రులు ఎక్కడ ఉన్నాయో తెలియట్లేదా? - అయితే ఇలా తెలుసుకోండి - RAJIV AAROGYASRI HOSPITAL TELANGANA

నిరుపేదల వైద్యానికి భరోసా కల్పించేందుకు ఆరోగ్యశ్రీ పథకం - ఈ సేవలు మన దగ్గర్లోని ఆసుపత్రుల్లో ఉన్నాయో లేదో తెలుసుకోండిలా.

Rajiv Aarogyasri Hospital
Rajiv Aarogyasri Hospital In Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 21, 2025, 12:21 PM IST

Rajiv Aarogyasri Hospital In Telangana : తెలంగాణ ప్రభుత్వం నిరుపేదల వైద్యానికి భరోసా కల్పించేందుకు వివిధ సంక్షేమ పథకాలను అందిస్తుంది. అందులో భాగంగానే కార్పొరేట్‌ స్థాయిలో పేదలకు ఉచిత వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ సేవలను అందిస్తుంది. గతంలో ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5 లక్షల ఉండేది. ప్రస్తుత ప్రభుత్వం 5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పెంచింది. దీంతో పాటు ఈ పథకంలో మరో 163 వైద్య చికిత్సలను జత చేసింది. మొత్తంగా 1,835 చికిత్సలకు అవకాశం కల్పించింది. అయితే ఆరోగ్యశ్రీకార్డుని ఆమోదించే ఆసుపత్రుల్లో మాత్రమే ఈ సేవలు అందనున్నాయి.

అయితే ఆరోగ్యశ్రీ సేవలు ఏ ఆసుపత్రిలో అందిస్తారో తెలియక రోగులు చాలా ఇబ్బందిపడుతున్నారు. కొన్నిసార్లు ఆరోగ్యశ్రీ వర్తించని ఆసుపత్రులకు వెళ్లి లేదని చెప్పడంతో తిరిగి వస్తున్నారు. ఇలాంటి వారు ఫోన్‌లో, కంప్యూటర్‌లో ఆరోగ్యశ్రీ సేవలు మన దగ్గర్లో ఎక్కడ ఉన్నాయో సులువుగా తెలుసుకోవచ్చు. అదెలాగో ఓ సారి చూద్దాం.

ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు

  • కంప్యూటర్‌ లేదా స్మార్ట్‌ఫోన్‌లో బ్రౌజర్‌ ఓపెన్‌ చేసి రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పోర్టల్‌ని( rajivaarogyasri.telangana.gov.in ) ఓపెన్ చెయ్యాలి.
  • పేజీ ఓపెన్‌ కాగానే పైన సర్వీస్‌ బార్‌లో కనిపించే ఆసుపత్రులు అనే ఆప్షన్​ను సెలక్ట్ చేసుకోవాలి.
  • తర్వాత రాజీవ్‌ ఆరోగ్యశ్రీ ఆసుపత్రి అనే విభాగాన్ని క్లిక్‌ చేయగానే మూడు ఆప్షన్లు ప్రత్యక్షమవుతాయి.
  • ఈ మూడు ఆప్షన్ల ద్వారా దగ్గర్లోని రాజీవ్‌ ఆరోగ్యశ్రీ ఆసుపత్రులను తెలుసుకోవచ్చు.
  • ఎంచుకున్న ఆప్షన్‌ను క్లిక్‌ చేస్తే కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది. జిల్లా మండలం, ఆసుపత్రి ఎంచుకోగానే అందుబాటులో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు, వాటిలో అందించే సేవలు కనిపిస్తాయి.
  • ఆసుపత్రి చిరునామా, ఆరోగ్యమిత్రల పేర్లు, ఫోన్‌ నంబర్లు అందుబాటులో ఉంటాయి.
  • మీరు రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం పొందాలనుకుంటే ఇలా సులువుగా ఆరోగ్యశ్రీ ఉచిత వైద్య సేవల వివరాలను తెలుసుకోవచ్చు. ఇంకేదైనా సందేహం ఉంటే మీరు వెళ్లాలనుకుంటున్న హాస్పిటల్ ఆరోగ్య​ మిత్ర సభ్యులకు ఫోన్ చేసి మీ వైద్యం గురించి తెలియజేయండి.
  • అవసరమైతే ఆసుపత్రికి వెళ్లి కావాల్సిన సేవలు ఉన్నాయో లేదో తెలుసుకోవడం మంచిది.

ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ - ఒక్క క్లిక్​తో మీ దగ్గరలోని ఆసుపత్రుల లిస్టు తెలుసుకోండి!

రేషన్‌కార్డు, ఆరోగ్యశ్రీ కార్డుకు లింకు పెట్టొద్దు : సీఎం రేవంత్‌ - TG Digital Health Profile Card

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.