ETV Bharat / entertainment

ప్రముఖ విలన్ విజయ్ రంగరాజు కన్నుమూత- టాలీవుడ్ సంతాపం! - VIJAYA RANGARAJU PASSED AWAY

గుండెపోటుతో సీనియర్ నటుడు రంగరాజు మృతి

Vijaya Rangaraju
Vijaya Rangaraju (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 20, 2025, 12:40 PM IST

Vijaya Rangaraju Passed Away : తెలుగు సీనియర్ నటుడు విజయ రంగరాజు గుండెపోటుతో సోమవారం మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపదడుతున్న రంగరాజు, చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇటీవల షూటింగ్‌లో గాయపడ్డ రంగరాజు చికిత్స కోసం చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అయితే సడెన్​గా గుండెపోటుకు గురై రంగరాజు మృతి చెందారు. ఆయన మృతి పట్ల టాలీవుడ్ ఇండస్ట్రీ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది.

కాగా, 1994లో భైరవద్వీపం సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. 30 ఏళ్ల కెరీర్​లో ​విలన్, సహాయ పాత్రలు పోషించారు. ముఖ్యంగా గోపిచంద్ 'యజ్ఞం' సినిమాతో రంగరాజుకు మంచి గుర్తింపు లభించింది. ఆ సినిమాలో విలన్​గా ఆకట్టుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.