ETV Bharat / international

కెనడా, మెక్సికో, చైనాపై టారిఫ్​లు అమలు- ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడనుందా? - TRUMP TARIFFS

అమెరికా కీలక నిర్ణయం- కెనడా, మెక్సికో, చైనాపై సుంకాలు అమలు

Trump Tariffs On Canada
Trump Tariffs On Canada (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 1, 2025, 11:29 AM IST

Trump Tariffs On Canada : కెనడా, మెక్సికో నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువులపై 25 శాతం సుంకం, చైనా వస్తువులపై 10 శాతం సుంకం శనివారం నుంచి అమల్లోకి వస్తాయని వైట్ హౌస్ తెలిపింది. అక్రమ వలసలు, మాదకద్రవ్యాలను అరికట్టేందుకే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

"శనివారం నుంచి మెక్సికో, కెనడా, చైనాపై విధించిన సుంకాలు అమల్లోకి వస్తాయి. మెక్సికో, కెనడాపై 25శాతం సుంకాలు, 10 మిలియన్ల అమెరికన్ల చావుకు కారణమైన ఫెంటానిల్​ను యూఎస్ పంపినందుకు చైనాపై 10శాతం సుంకం విధిస్తున్నాం. ఇవి ఎన్నికల్లో అధ్యక్షుడు ఇచ్చిన హామీలు. అందుకే ఆయన ఈ వాగ్దానాలను నిలబెట్టుకున్నారు" అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తెలిపారు.

ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం యునైటెడ్ స్టేట్స్ అక్టోబర్​లో కెనడా నుంచి రోజూ దాదాపు 4.6 మిలియన్ బ్యారెళ్ల చమురును, మెక్సికో నుంచి 5,63,000 బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకుంది. అదే నెలలో యూఎస్ రోజువారీ ఉత్పత్తి సగటున రోజుకు 13.5 మిలియన్ బ్యారెల్స్.

స్పందించిన కెనడా, మెక్సికో
తమ దేశ వస్తువులపై ట్రంప్ సర్కార్ సుంకాలు విధించడంపై కెనడా, మెక్సికో స్పందించాయి. అవసరం అయితే తాము అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై సుంకాలు విధిస్తామని హెచ్చరించాయి.

"మా దేశ వస్తువులపై అమెరికా సుంకాలు విధిస్తే కెనడా ప్రతిస్పందనకు సిద్ధంగా ఉంది. సుంకాల విధించడంపై ట్రంప్ ముందుకెళ్తే మేము అదే విధంగా ముందుకు సాగుతాం. సుంకాలు అమెరికాకు వినాశకరమైన పరిణామాలను కలిగిస్తాయి. ఇవి అమెరికన్ల ఉద్యోగాలను ప్రమాదంలో పడేస్తాయి. అలాగే ధరలు పెరుగుదలకు కారణం అవుతాయి. యూఎస్​లోకి ఫెంటానిల్, అక్రమ వలసదారులు ఒక శాతం కంటే తక్కువే కెనడా నుంచి వచ్చారు. " అని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యానించారు.

మా వద్ద ప్లాన్స్ ఉన్నాయి : మెక్సికో అధ్యక్షుకాలు
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికార బాధ్యతలు చేపట్టేముందు యూఎస్​తో మెక్సికో బృందం చర్చలు జరిపిందని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్ బామ్ తెలిపారు. అయితే మెక్సికోపై యునైటెడ్ స్టేట్స్ విధించే సుంకాల విషయంలో తమ వద్ద ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి ఉందని పేర్కొన్నారు. తాము ఎల్లప్పుడూ దేశ ప్రజల గౌరవాన్ని, సార్వభౌమాధికారాన్ని కాపాడతామని స్పష్టం చేశారు.

కెనడా, మెక్సికోపై 25 శాతం, చైనా వస్తువులపై 10 శాతం సుంకాలు విధించడం వల్ల యూఎస్‌ సహా అన్ని ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటాయని వార్విక్ మెక్‌ కిబ్బిన్ అండ్ మార్కస్ నోలాండ్ అనే అధ్యయనం తేల్చింది. మెక్సికోపై విధించే 25శాతం టారిఫ్ వల్ల ఆ దేశంలో ఆర్థిక క్షీణత ఏర్పడుతుందని పేర్కొంది. ఇది మెక్సికన్ వలసదారులు అక్రమంగా యూఎస్ లోకి ప్రవేశించడానికి కారణమవుతుందని తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.