తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'పుష్ప 2' బిగ్ అప్డేట్- బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ- టీజర్ వచ్చేది అప్పుడే - Pusha 2 Teaser - PUSHA 2 TEASER

Pusha 2 Teaser: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న పుష్ప- 2నుంచి కీలక అప్డేట్ వచ్చింది.

Pusha 2 Teaser
Pusha 2 Teaser

By ETV Bharat Telugu Team

Published : Apr 2, 2024, 4:32 PM IST

Updated : Apr 2, 2024, 6:25 PM IST

Pusha 2 Teaser: ఐకాన్​స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ 'పుష్ప- 2' నుంచి కీలకమైన అప్డేట్ వచ్చింది. ఈ సినిమా టీజర్​ను ఏప్రిల్ 8న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ మంగళవారం తెలిపారు. 'పుష్ప మాస్ జాతరా, హీ ఈజ్ కమింగ్ విత్ డబుల్ ఫైర్' అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. కాలికి గజ్జెలు కట్టి ఉన్న ఈ పోస్టర్​ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్​గా మారింది. ఇక ఈ అప్డేట్​తో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ జోష్​లో ఉన్నారు.

ఇక ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన గ్లింప్స్ వీడియో, పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ సినిమాలో బన్నీకి జోడీగా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా నటిస్తోంది. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్, ప్రియమణి, అనసూయ, విజయ్ సేతుపతి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజిక్ సంచలనం దేవీ శ్రీ ప్రసాద్ ఈ మూవీకి సంగీతం అందిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్​ బ్యానప్​పై నవీన్ యర్నేని, రవి శంకర్ నిర్మిస్తున్నారు. 2024 ఆగష్టు 15న పుష్ప- 2 వరల్డ్​వైడ్​గా గ్రాండ్​గా రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ఇదివరకే తెలిపారు.

Allu Arjun Wax Statue: అల్లు అర్జున్​కు ఇటీవల అరుదైన గౌరవం దక్కింది. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం నిర్వాహకులు దుబాయ్​లో అల్లు అర్జున్ మైనపు విగ్రాహం ఏర్పాటు చేశారు. పుష్ప సినిమాలోని తగ్గేదేలే మేనజరింతో ఉన్న విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్ 21ఏళ్ల సినీ కెరీర్​ సందర్భంగా, మార్చి 28న ఈ విగ్రహాన్ని ఓపెనింగ్ చేశారు. ఈ విగ్రహాన్ని స్వయంగా బన్నీయే ఓపెనింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి స్నేహా రెడ్డి, పిల్లలు అయాన్, అర్హ తోపాటు సోదరుడు అల్లు శిరీశ్​ కూడా పాల్గొన్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఆయా నగరాల్లో ఉన్న టుస్సాడ్స్ మ్యూజియంలో ఇప్పటికే పలువురు టాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ప్రభాస్, మహేశ్ బాబు, కాజల్ అగర్వాల్ మైనపు విగ్రహాలు ఆయా నగరాల్లోని మ్యూజియంలో ఉన్నాయి.

అల్లు అర్జున్ - అట్లీ మూవీలో హీరోయిన్​ ఎవరంటే? - Atlee Allu Arjun Movie

టుస్సాడ్స్​లో బన్నీ మైనపు విగ్రహం- 'తగ్గేదేలే' స్టిల్ అదుర్స్​! - Allu Arjun Wax Statue

Last Updated : Apr 2, 2024, 6:25 PM IST

ABOUT THE AUTHOR

...view details