Keerthy Suresh Antony Relationship :కోలీవుడ్ ప్రముఖ నటి కీర్తి సురేశ్ తాజాగా తన రిలేషన్షిప్ గురించి ఓపెనప్ అయ్యారు. ఆంటోనీ అనే వ్యక్తితో ఆమె 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తన ప్రియుడితో ఆమె దిగిన ఓ స్పెషల్ ఫొటోను షేర్ చేశారు. ఇప్పుడీ అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌తో అన్ని రూమర్స్‌కు ఓ క్లారిటీ వచ్చినట్లు అయ్యింది.
గతంలోనూ ఆమె పెళ్లి గురించి రకరకాల రూమర్స్ వచ్చాయి. అయితే వాటిని ఆమెతో పాటు తన ఫ్యామిలీ ఖండించారు. ఆ తర్వాత ఆంటోనీ పేరు తెగ ట్రెండ్ అయ్యింది. తన స్నేహితుడితో ఆమె ఏడడుగులు వేయనున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలోనూ ప్రచారం జరిగింది. ఇంజినీరింగ్ చదివిన ఆంటోనీ కొంతకాలం విదేశాల్లో ఉద్యోగం చేశారని, ప్రస్తుతం ఆయనకు కేరళలో బిజినెస్ చేస్తున్నారని టాక్ నడిచింది. ఇక కాలేజీ రోజుల నుంచి కీర్తి - ఆంటోనీ స్నేహితులని, ఇప్పుడు పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. అలా గతంలోనే ఈ ఇద్దరూ పేర్లు నెట్టింట తెగ ట్రెండైనప్పటికీ ఎవ్వరూ ఈ రూమర్స్‌పై స్పందించలేదు. తాజాగా కీర్తి తండ్రి కూడా తమ కుమార్తె పెళ్లి గురించి త్వరలోనే చెప్తామని వెల్లడించడం వల్ల అందరికీ ఓ క్లారిటీ వచ్చింది.
ఇక కీర్తి కెరీర్ విషయానికి వస్తే, 'గీతాంజలి' అనే మలయాళ చిత్రంతో తెరంగేట్రం చేసిన ఈమె 'నేను శైలజ'తో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళంలోనూ మంచి మంచి ఆఫర్లు అందుకుని దూసుకెళ్లారు. 'మహానటి'తో పాన్ఇండియా లెవెల్లో పాపులర్ అవ్వడమే కాకుండా ఆ చిత్రానికిగానూ ఆమె ఉత్తమ నటిగా జాతీయ అవార్డును అందుకున్నారు.