తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'కల్కి' బ్యూటీ దిశాపటానీ సిస్టర్​ను చూశారా? - ఆర్మీలో లెఫ్టినెంట్​ ఉద్యోగి - khushboo patani - KHUSHBOO PATANI

Disha Patani Sister Khushboo Patani : లోఫర్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన అందాల భామ దిశా పటాని సిస్టర్ ఖుష్బూ పటాని గురించి మీకు తెలుసా? ఆ వివరాలు.

కల్కి బ్యూటీ దిశాపటానీ సిస్టర్​ను చూశారా? - ఆర్మీలో లెఫ్టినెంట్​ ఉద్యోగి
కల్కి బ్యూటీ దిశాపటానీ సిస్టర్​ను చూశారా? - ఆర్మీలో లెఫ్టినెంట్​ ఉద్యోగి

By ETV Bharat Telugu Team

Published : Mar 26, 2024, 7:53 AM IST

Disha Patani Sister Khushboo Patani : లోఫర్ సినిమాలో తన అందంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన దిశా ఆ తర్వాత ధోనీ సినిమాతో బాలీవుడ్​లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. చేసినవి కొన్ని సినిమాలే అయినా క్రేజీ హీరోయిన్​గా పేరు తెచ్చుకుంది. అయితే దిశాకు ఒక అక్క కూడా ఉంది. అయితే సాధారణంగా తారల తోబుట్టువులు లేదా కుటుంబ సభ్యులు సినిమా ఇండస్ట్రీని ఎంచుకుంటూ ఉంటారు. అయితే దిశా అక్క ఖుష్బూ పటాని మాత్రం దేశానికి సేవ చేయాలని నిర్ణయించుకుని ఆర్మీలో చేరింది. ఆర్మీలో లెఫ్టినెంట్​ ఉద్యోగిగా సేవలు అందిస్తోంది.

1991లో జన్మించిన ఖుష్బూ పటాని స్వస్థలం బరేలి, ఉత్తరప్రదేశ్ బరేలిలోనే తన ప్రాథమిక విద్యను పూర్తి చేసి DITలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్​లో పట్టా అందుకుంది. గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఆర్మీలో చేరాలని నిర్ణయించుకుంది ఖుష్బూ. దేశానికి సేవ చేయాలనే తపన తనను కమిషన్డ్ ఆఫీసర్​గా చేసింది. అందులో తన ర్యాంక్ వలన లెఫ్టినెంట్ హొదా పొందుతోంది.

ఫిట్నెస్ మీద తన చెల్లికి ఉన్నట్లే ఖుష్బూకు చాలా ఆసక్తి ఉంది. యాక్టివ్ లైఫ్ స్టైల్ కోసం ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం అని నమ్ముతుంది ఖుష్బూ. మిలిటరీ ట్రైనింగ్ ద్వారా ఫిట్నెస్ మీద మరింత ఆసక్తి పెంచుకుంది. సోషల్ మీడియాలో వర్క్ అవుట్ వీడియోస్​ను షేర్ చేస్తూ తన ఫాలోవర్స్​ను యాక్టివ్​గా ఉండమని ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫాలోవర్స్​తో తన లైఫ్ అప్డేట్స్ పంచుకుంటూ సోషల్ మీడియాలో యాక్టివ్​గా ఉంటుంది.

ఆర్మీలో ఉద్యోగంతో పాటు తన జీవితాన్ని తనకు నచ్చినట్టుగా గడపుతూ ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంది ఖుష్బూ. దేశభక్తి, పట్టుదలతో పాటు అభిరుచికి తగ్గ వృత్తిని ఎంచుకోవడమే కాదు ఆరోగ్యం మీద తనకు ఉన్న అవగాహనతో తన ఫాలోవర్స్​కు ఫిట్​గా ఎలా ఉండాలో చెబుతూ స్పూర్తిని అందిస్తుంది. ఇకపోతే దిశా పటాని విషయానికొస్తే చాలా కాలం తర్వాత త్వరలోనే మళ్లీ టాలీవుడ్ తెరపై కల్కి సినిమాతో సందడి చేయనుంది.

విజయ్ అలా రష్మిక ఇలా ! - టాలీవుడ్ ​టు బాలీవుడ్​ సినీ తారల హోలీ సంబరాలు చూశారా ? - Cinema Stars Holi Celebration

'కల్కి' విషయంలో బాంబ్ పేల్చిన కమల్ హాసన్ - ఇలా షాకిచ్చారేంటి? - Kalki 2898 Ad kamal Haasan

ABOUT THE AUTHOR

...view details