తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఇండియన్​​ రిచ్చెస్ట్ సింగర్- రూ.1748 కోట్ల నెట్​వర్త్- సినిమాకు రూ.10 కోట్ల రెమ్యునరేషన్- ఎవరంటే? - India Richest Singer - INDIA RICHEST SINGER

India's Richest Singer: భారత దేశపు అత్యంత సంపన్న గాయకుడు ఎవరు అన్నది ఎప్పుడైనా ఆలోచించారా? ప్రస్తుతం ఉన్న క్రేజ్​ని బట్టి భారతీయ గాయకులలో కూడా లక్షలు, కోట్లు వసూలు చేసేవారున్నాయి. అయితే మన దేశపు అత్యంత ఖరీదైన గాయకుడు దిల్జిత్ దోసాంజ్ లేదా అర్జిత్ సింగ్ అని మీరు అనుకుంటే కచ్చితంగా పొరబడినట్టే. నిజానికి వారు ఒక్కో పాటకూ బాగానే వసూలు చేస్తారు. కానీ, అత్యంత డిమాండ్ ఉన్న కాస్ట్లీ గాయకులలో మొదటి స్థానంలో మాత్రం వారిద్దరూ లేరు. మరి ఎవరున్నారంటే?

Indias Richest Singer
Indias Richest Singer (Source: ANI)

By ETV Bharat Telugu Team

Published : Jul 24, 2024, 10:55 PM IST

India's Richest Singer: ప్రపంచ సినిమాల నుంచి భారతీయ చలన చిత్రాలను వేరుచేసినది సంగీతంఅన్న మాట అతిశయోక్తి కాదు. మన సినిమాలలో కనిపించని హీరో సంగీతం. కథను నడిపించే క్రమంలో కీలక పాత్ర పోషించేది సంగీతమే. భారతీయ సినిమా ఆత్మ సంగీతంలో ఉంది. పాటలు మన సినిమాలకు ప్రత్యేకమైన గుర్తింపును ఇచ్చాయి. అలాగే భారతీయ గాయకులకు కూడా ఒక ప్రత్యేక రేంజ్ ఉంది. అయితే గాయకులు అనగానే మనం దిల్జిత్ దోసాంజ్, అర్జిత్ సింగ్, సోనూ నిగమ్ గురించే ఆలోచిస్తాం. కానీ తాజా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యంత ధనవంతులైన గాయకుడు ఎవరంటే?

ఏఆర్ రెహమాన్: భారతీయ సినీ సంగీతాన్ని ప్రపంచస్థాయిలో నిలిపిన సంగీత దర్శకుడాయన. పబ్లిక్‌గా అందుబాటులో ఉన్న ఇతర డేటా ప్రకారం, 57 ఏళ్ల సంగీతకారుడి నికర విలువ రూ.1,728 కోట్లు. ఒక పాట కోసం రూ. 3 కోట్లు వసూలు చేసే లెజెండరీ ఆర్టిస్ట్ భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందుతున్న గాయకుడు కూడా. మూడు దశాబ్దాల రెహమాన్ కెరీర్​లో ఆరు జాతీయ అవార్డులు, రెండు ఆస్కార్‌లు, రెండు గ్రామీ అవార్డులు ఉన్నాయి. రెహమాన్​ను భారత ప్రభుత్వం పద్మభూషణ్​తో సత్కరించింది కూడా. తన మొదటి సినిమా రోజా కోసం రూ.25,000 పారితోషికం తీసుకున్న రెహమాన్ ఆస్తి ఇప్పుడు రూ.1748 కోట్లు. ఇప్పుడు ఒక్క సినిమాకు రూ. 8 నుంచి 10 కోట్లు పారితోషికం తీసుకుంటున్నారు. అలాగే లైవ్ పెర్ఫార్మెన్స్ కోసం రూ.1- 2 కోట్లు ఛార్జ్ చేస్తారట.

అర్జిత్ సింగ్:బాలీవుడ్ హార్ట్ బ్రేక్, రొమాంటిక్ పాటల కింగ్ అర్జిత్ సింగ్. ఆషికీ- 2 లో పాటలతో అభిమానుల హృదయాలు దోచుకున్న అర్జిత్ సింగ్ బాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన నేపథ్య గాయకులలో మొదటి వరుసలో ఉంటాడు. వందల సంఖ్యలో పాటలు పాటలు పాడిన అర్జిత్ నికర విలువ రూ. 414 కోట్లుగా అంచనా.

ఇక పంజాబ్‌ కు చెందిన పాపులర్ రాపర్ యోయో హనీ సింగ్ నికర ఆదాయం రూ. 205 కోట్లు కాగా, ప్రముఖ పంజాబీ గాయకుడు, నటుడు దిల్జిత్ దోసాంజ్. దిల్జిత్ నికర విలువ రూ. 172 కోట్లు. భారతదేశంలోని అత్యంత ధనవంతులైన మ్యూజిషియన్లలో సోనూ నిగమ్ కూడా ఉన్నాడు. అతని నికర విలువ రూ. 400 కోట్లు.

'రెహమాన్ అడగలేదు - మరి మీరెందుకు అడుగుతున్నారు ఇళయరాజా!?' - Ilayarajas Copyright Issue

'షారుక్​కు నా వాయిస్ సెట్​ కాదు - అందుకోసం నిద్రలు మాని కష్టపడ్డాను' - Arijit Singh Shahrukh Khan Song

ABOUT THE AUTHOR

...view details