Hyper Aadi Marriage :హైపర్ ఆది - ఈ పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరు. ఎందుకంటే స్టేజీలపై ఈయన వేసే పంచులు అలాంటివి. ఆడియెన్స్‌ను కడుపుబ్బా నవ్విస్తాయి. చాలా ఏళ్లుగా జబర్దస్త్ షోలో కమెడియన్‌గా రాణిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మరోవైపు సినిమాల్లోనూ రాణిస్తూ కెరీర్లో దూసుకెళ్తున్నారు. ఈయన పర్సనల్ లైఫ్ విషయానికొస్తే ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. ఆయన పెళ్లిపై ఇప్పటికే చాలా రూమర్స్ వచ్చాయి. కానీ ఏదీ నిజం కాలేదు. అయితే తాజాగా ఆయన ఎందుకు ఇంకా సింగిల్‌గానే ఉన్నారో తెలిపారు. అందుకు కారణం రాక్ స్టార్ ప్రముఖ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ అని తెలిపారు. తాజాగా రిలీజ్ చేసిన గామా టాలీవుడ్ మూవీ అవార్డ్స్ 2024 ప్రోమో ఈ విషయం గురించి చెప్పారు. మీరు దీన్ని చేసేయండి.
ప్రతి శనివారం ప్రేక్షకులకు వినోదం అందిస్తున్న షో సుమ అడ్డా. ఈ వారం ఎపిసోడ్లో బుల్లితెర నటులు శ్రుతి, ప్రీతి నిగమ్, భార్గవి, శిరీష, లహరి, అంజలి సందడి చేశారు. సుమ వేసే చిలిపి ప్రశ్నలకు ఫన్నీ సమాధానాలు చెప్పారు. ముఖ్యంగా అత్తా కోడళ్ల గురించి సరదాగా సాగిన ఈ ఎపిసోడ్ సంబంధించి తాజా ప్రోమోను విడుదల చేశారు. మార్చి 30న పూర్తి ఎపిసోడ్ ప్రసారం కానుంది. మీరూఓ లుక్కేయండి.
ప్రతి శుక్రవారం ప్రేక్షకులకు ఎంతో మంచి వినోదాన్ని పంచే కామెడీ షో ఎక్స్ ట్రా జబర్దస్త్. మార్చి 22న ప్రసారం అయిన ఎపిసోడ్లో ఎప్పటిలాగే రష్మీ సూపర్ సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చింది. వర్ష, ఇమాన్యుయెల్ పండించిన కామెడీ కడుపుబ్బా నవ్వించింది. లేడీ గెటప్‌లో రాకేష్, రామ్‌ప్రసాద్, ప్రెసిడెంట్‌గా బుల్లెట్ భాస్కర్ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ ఎసిసోడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ప్రతి గురువారం బుల్లితెర ప్రేక్షకులను సరదా నవ్విస్తోన్న కామెడీ షో జబర్దస్త్. ఎప్పటిలాగే ఈ వారం కూడా సరికొత్త స్కిట్స్‌తో అలరించారు. మార్చి 21న ప్రసారమైన ఎపిసోడ్ ప్రోమో విడుదలై ఆకట్టుకుంది. మీరూ చూడండి.
బుల్లితెర షోల్లో శ్రీదేవి డ్రామా కంపెనీ షో చాలా ఫేమస్. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 1గంటలకు ప్రసారమయ్యే ఈ షోకు ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. ఈ షో ద్వారా ఎంతో మంది తమ టాలెంట్ నిరూపించుకుంటారు. ఈ వారం హోలీ స్పెషల్ తో యాంకర్ రష్మీ, ఆది ఎంట్రీ ఇచ్చే సాంగ్ అదిరిపోయింది. ఈ వారం హోలీ పండగకు సంబంధించిన సరికొత్త కాన్సెప్ట్ తో శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ సాగనుంది. దీనికి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు.
ప్రముఖ కామెడీయన్ అలీ వ్యాఖ్యాతగా ప్రతి మంగళవారం ప్రేక్షకులకు వినోదం పంచుతున్న షో అలీతో సరదాగా. మార్చి 26న ప్రసారం కానున్న ఎపిసోడ్లో పాత తరం నటి రాధా సందడి చేశారు.అలీతో రాధా ఫసక్ అనే పదం ఉపయోగించడం ప్రోమోలో హైలెట్ గా నిలిచింది. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల అయింది. మీరూ చూడండి.