Director Shankar Game Changer :ఒకరేమో 90ల్లో పాన్ ఇండియా రేంజ్ సినిల దర్శకుడు, మరొకరేమో టాలీవుడ్లో ఇండస్ట్రి హిట్స్ ఇచ్చారు, మిగిలిన ఇద్దరు టాలీవుడ్ లో క్లాసిక్ హిట్స్ కొట్టారు. కానీ ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు వాళ్లను హిట్ పలకరించి చాలా కాలం అయింది. మరి వాళ్లు ఇప్పుడు చేస్తున్న సినిమాలతో అయినా హిట్ కొట్టే ఛాన్స్ ఉందా? తెలుసుకుందాం.
వివరాల్లోకి వెళితే : ఇప్పుడంటే పాన్ ఇండియా, పాన్ వరల్డ్ అంటున్నారు గాని ఒకప్పుడు ఒక ప్రాంతీయ భాష సినిమాను మరొక భాషలో రిలీజ్ చేస్తే దానిని డబ్బింగ్ సినిమా అనేవారు. అలా 90ల్లోనే తన సినిమాలతో దేశవ్యాప్తంగా పేరు సంపాదించారు దర్శకుడు శంకర్. తమిళంలో 1993లో జెంటిల్మన్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన శంకర్ ఆ సినిమాతో మొదటి హిట్ అందుకున్నారు. ఆ తర్వాత ప్రేమికుడు, ఇండియన్(తెలుగులో భారతీయుడు), జీన్స్, ఒకే ఒక్కడు, బాయ్స్ లాంటి హిట్స్‌తో టాప్‌లోకి వెళ్లారు శంకర్.
అయితే 2010లో రజనీ కాంత్‌తో చేసిన రోబో హిట్ తర్వాత అంతటి రేంజ్లో శంకర్‌కు సక్సెస్ దక్కలేదు. ముఖ్యంగా 2018లో వచ్చిన రోబో 2.0, ఐ కమర్షియల్‌గా విజయం సాధించకపోయాయి. ప్రస్తుతం ఆయన కమల్ హాసన్‌తో చేస్తున్న ఇండియన్ - 2 , రామ్ చరణ్‌తో చేస్తున్న గేమ్ చేంజర్పైనే ఆశలు పెట్టుకున్నారు. ఆ రెండు సినిమాల విజయం 14 ఏళ్లుగా సరైన హిట్ లేని శంకర్‌కు ఎంతో అవసరమనే చెప్పాలి.
Puri jagannadh Double ismart : హీరోలతో బులెట్ లాంటి డైలాగ్‌లు చెప్పించడంలో పూరీ జగన్నాధ్‌కు సాటి ఎవరు లేరు. రవితేజా లాంటి హీరోలను ఇండస్ట్రిలో నిలదొక్కునేలా చేసిన, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ను ఇండస్ట్రికి పరిచయం చేసిన ఘనత పూరీకే దక్కుతుంది. మహేశ్ బాబు తో 2006లో చేసిన పోకిరి అప్పటివరకు ఉన్న తెలుగు సినిమా రికార్డులను తిరగరాసింది. అంతటి హిట్స్ సాధించిన పూరీకి టెంపర్ తర్వాత సరైన హిట్ దక్కలేదు. ఇస్మార్ట్ శంకర్ పర్వాలేదనిపించినా విజయ్ దేవరకొండతో చేసిన లైగర్ డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో టాలీవుడ్ దర్శకుల రేసులో ఉండాలంటే ఇప్పుడు ఆయన ఖాతాలో అర్జెంట్‌గా ఒక హిట్ పడాలి. ప్రస్తుతం పూర్తి డబుల్ ఇస్మార్ట్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం పూరిని మళ్లీ రేసులో నిలబెడుతుందో లేదో చూడాలి.