తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

షారుక్ ఖాన్ ఫస్ట్ శాలరీ ఎంతో తెలుసా?- ఇది మీ ఊహకు అస్సలు అందదు! - SHAH RUKH KHAN FIRST SALARY

బాలీవుడ్​ బాద్​షా షారుక్ ఖాన్ తొలి జీతం- తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారు!

Shah Rukh Khan First Salary
Shah Rukh Khan First Salary (Source : Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Dec 8, 2024, 2:20 PM IST

Shah Rukh Khan First Salary :బాలీవుడ్ బాద్​షా షారుక్ ఖాన్​కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెరీర్ తొలినాళ్లలో టీవీ సీరియల్స్​లో నటించిన షారుక్, ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చారు. ఆ తర్వాత కెరీర్​లో వెనుదిరిగి చూసుకోకుండా బాలీవుడ్ అగ్రనాయకుడిగా ఎదిగారు. ఈ క్రమంలో షారుక్ తొలి జీతం ఎంతో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

భారీగా సంపాదన
ఫోర్బ్స్ ప్రకారం, దేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే, అత్యంత ధనికుడైన నటుడిగా షారుక్ ఖాన్ నిలిచారు. ఒక్కో సినిమాకు ఈ బాలీవుడ్ సూపర్ స్టార్ రూ.150-250 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారు. అంత మొత్తం ఇచ్చేందుకు సినీ నిర్మాతలు కూడా వెనుకాడరు. ఎందుకంటే షారుక్ సినిమాలకు కలెక్షన్లు అంతటి భారీ స్థాయిలో వస్తుంటాయి.

తొలి జీతం అదే
షారుక్ తన కెరీర్ తొలినాళ్లలో టెలివిజన్​లో నటించారు. ఆ తర్వాత 90వ దశకం ప్రారంభంలో చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత బాలీవుడ్‌లో తిరుగులేని రాజుగా ఎదిగారు. అయితే ఓ సందర్భంలో షారుక్ తన తొలి జీతం గురించి ప్రస్తావించారు. తాను కెరీర్ తొలినాళ్లలో పంకజ్ ఉధాస్ కచేరీలో అషర్‌గా పనిచేసినట్లు గుర్తుచేసుకున్నారు. అప్పుడు రూ. 50 తొలి జీతంగా సంపాదించానని చెప్పుకొచ్చారు.

భారీ హిట్లు
గతేడాది షారుక్ ఖాతాలో భారీ హిట్లు పడ్డాయి. 'పఠాన్', 'జవాన్' సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. ఈ రెండు సినిమాలు రూ.1000కోట్లకు పైగా కలెక్షన్లు సాధించాయి. అలాగే ఆఖరిగా విడుదలైన 'డంకీ' కూడా ఫర్వాలేదనిపించింది. ప్రపంచవ్యాప్తంగా డంకీ మూవీ రూ.450కోట్లు మార్క్ అందుకుంది.

సినిమాల పరంగా
ఇకపోతే షారుక్​ తన కుమార్తె సుహానా ఖాన్‌తో కలిసి 'కింగ్‌' అనే సినిమా చేస్తున్నట్లు చాలా కాలం నుంచి వార్తలు వస్తున్నాయి. తండ్రీకూతుళ్లు గురుశిష్యులుగా నటించనున్నారట. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టును అధికారికంగా చెప్పలేదు. కానీ, షారుక్​ ఆ మధ్య ఈ సినిమా గురించి మాట్లాడారు.

'లస్ట్‌ స్టోరీస్‌ 2', 'కహానీ 2', 'బద్లా నైనా' వంటి ప్రాజెక్టులతో దర్శకుడిగా మంచి పేరు సొంతం చేసుకున్న సుజోయ్‌ ఘోష్‌ దీన్ని తెరకెక్కిస్తున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. అభిషేక్‌ బచ్చన్‌ కీలక పాత్రలో ప్రతినాయకుడిగా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది జనవరిలో షూటింగ్‌ ప్రారంభించనున్నారట.

ఆ సినిమాను ఈ ముగ్గురు రిజెక్ట్ చేశారు! - ఖాన్స్ కాదన్న ఆ కథ ఏదంటే?

చెర్రీ కోసం షారుక్ ఖాన్! - 'గేమ్ ఛేంజర్' మేకర్స్ భారీ ప్లాన్!

ABOUT THE AUTHOR

...view details