తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

శుభ్​మన్​ గిల్​తో డేటింగ్​ - అసలు విషయం బయట పెట్టిన అనన్య పాండే! - Ananya Pandey Shubman Gill - ANANYA PANDEY SHUBMAN GILL

Ananya Pandey Shubman Gill : స్టార్ క్రికెటర్​ శుభమన్​ గిల్​తో హీరోయిన్​ అనన్య పాండే డేటింగ్ చేస్తున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై అనన్య స్పందించింది. పూర్తి వివరాలు స్టోరీలో.

Shubman Gill  Ananya Pandey
Shubman Gill Ananya Pandey (source Associated Press and ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 30, 2024, 1:00 PM IST

Ananya Pandey Shubman Gill : బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండే సినీ ప్రియులకు పరిచయమే. స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2, లైగర్‌, డ్రీమ్‌గర్ల్‌ 2 లాంటి చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైంది. విజయ్ దేవరకొండ 'లైగర్​' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ అమ్మడుకు సినిమాల్లో పెద్దగా సక్సెస్ లేకపోయినా, బయట భారీగానే ఫ్యాన్​ ఫాలోయింగ్ ఉంది. అయితే గత కొద్ది కాలంగా ఈ అమ్మడు వార్తల్లో బాగా నిలుస్తోంది. సినిమాల కన్నా ఎక్కువగా వ్యక్తిగత విషయాల్లో ఈమె పేరు బాగా వినిపిస్తోంది.

ఈ ముద్దుగుమ్మ ఆ మధ్య కొంత కాలం పాటు నటుడు ఆదిత్య రాయ్ కపూర్‌తో డేటింగ్ చేసింది. విదేశాల్లో వీరిద్దరూ కలిసి బానే తిరిగారు. రొమాంటిక్ ఫోటోలకు కలిసి పోజులిచ్చారు. ఆ తర్వాత వీరిద్దరు బ్రేకప్​ చెప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి.

అనంతరం ఇప్పుడీ ముద్దుగుమ్మ స్టార్​​ క్రికెటర్​ శుభ్​మన్ గిల్​తో డేటింగ్ చేస్తున్నట్లు గత కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. వీరిద్దరు కలిసి ఒక యాడ్​లో నటించారు. ఆ యాడ్ షూటింగ్​ సమయంలోనే వీరిద్దరు ప్రేమలో పడ్డారని సోషల్​ మీడియాలో వార్తలు తెగ రావడం ప్రారంభమయ్యాయి.

తాజాగా ఈ విషయమై అనన్య పాండే స్పందించింది. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చింది. "విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఒక యాడ్ షూట్ సమయంలో కలిసి ప్రేమలో పడ్డారు. శుభ్​మన్ గిల్​ నేను కూడా అలాగే కలిశాం. అందుకే మేం ప్రేమలో ఉన్నాం అని కొందరు వార్తలు రాస్తున్నారు. అందులో ఎటువంటి నిజం లేదు. బేసిక్​గా మేం చాలా డిఫరెంట్ కూడా. నాకు, శుభ్‌మన్‌కు మధ్య ప్రస్తుతం మాటలు కూడా లేవు. అప్పుడు రొమాన్స్ ఎలా ఉంటుంది? అంటూ అనన్య పాండే స్పష్టత ఇచ్చింది.

కాగా, చివరి సారిగా ఖోగయే హమ్‌ కహా, బ్యాడ్ న్యూస్​, ఖేల్​ ఖేల్​ మెయిన్ చిత్రాల్లో కనిపించింది అనన్య పాండే. ప్రస్తుతం సీటీఆర్​ఎల్, శంకర్ అనే చిత్రాల్లో నటిస్తోంది.

'గోపాల గోపాల' నటుడు మిథున్‌ చక్రవర్తికి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు - Mithun Chakraborty Dadasaheb Phalke

బాలయ్య NBK 109 కోసం రాజస్థాన్‌ ఎడారి సెట్‌ - షూటింగ్ ఎక్కడ జరుగుతోందంటే? - NBK 109 Movie Rajasthan Set

ABOUT THE AUTHOR

...view details