తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అందుకే ఈ గ్యాప్​ - అఖిల్ లిస్ట్​లో మూడు భారీ ప్రాజెక్టులు! - Akkineni Akhil Upcoming Movies - AKKINENI AKHIL UPCOMING MOVIES

Akkineni Akhil Upcoming Movies : 'ఏజెంట్' తర్వాత ఎటువంటి అప్​డేట్స్ ఇవ్వని యంగ్ హీరో అఖిల్ తాజాగా తన అభిమనుల కోసం ఓ స్వీట్ సర్​ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారట. ఇంతకీ అదేంటంటే?

Akkineni Akhil Upcoming Movies
Akkineni Akhil (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jul 9, 2024, 7:54 AM IST

Akkineni Akhil Upcoming Movies :యంగ్ హీరో అక్కినేని అఖిల్ ప్రస్తుతం సాలిడ్ కమ్​బ్యాక్​ కోసం ఎదురుచూస్తున్నారు. గతేడాది వచ్చిన 'ఏజెంట్' సినిమా ఆశించిన స్థాయిలో హిట్​ టాక్ అందుకోవడం అక్కినేని అభిమానులను నిరాశలో మునిగిపోయారు. ఈ సినిమా కోసం అఖిల్ తీవ్రంగా శ్రమించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అయితే ఈ చిత్రం తర్వాత అఖిల్ తన అప్​కమింగ్ మూవీస్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. కనీసం ఇండస్ట్రీలో యాక్టివ్​గానూ కనిపించలేదు.

గతంలో 'సలార్' సక్సెస్ మీట్​లో డిఫరెంట్​ లుక్​లో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. దీంతో ఆయన త్వరలో కొత్త సినిమా గురించి అనౌన్స్ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ అటువంటిది ఏం జరగలేదు. మరికొందరేమో 'సలార్​ 2'లో అఖిల్​ నటిస్తున్నారని అన్నారు. అయితే అవి కూడా రూమర్సే అని తేలిపోయింది.

అయితే ఇంతకాలం అఖిల్ అజ్ఞాతంలో ఉన్నది మాత్రం తన అప్​కమింగ్ మూవీ కోసమే అంటూ తాజాగా సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. టాలీవుడ్ ప్రముఖ బ్యానర్ యువి క్రియేషన్స్ నిర్మించనున్న ఓ భారీ ప్యాన్ ఇండియా మూవీ కోసం అఖిల్ ఇన్నేళ్లు తీవ్ర కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

యంగ్ డైరెక్టర్ అనిల్ డెబ్యూ చిత్రంగా రానున్న సినిమాలో అఖిల్ గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా గురించి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్​మెంట్​ కూడా రానుందట.

మరోవైపు ఈ సినిమాతో పాటు అఖిల్ మరో రెండో ప్రాజెక్టులకు సైన్ చేసినట్లు సమాచారం. అందులో తమ సొంత బ్యానర్ అయిన అన్నపూర్ణ స్టూడియోస్​లో తెరకెక్కుతున్న చిత్రం ఒకటి. దీన్ని మురళి కిషోర్ అబ్బూరు డైరెక్ట్ చేయనున్నారు. చిత్తూరు బ్యాక్ డ్రాప్​తో ఈ కథ సాగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. దీంతో పాటు కోలీవుడ్ డైరెక్టర్ గౌతమ్ మేనన్ తెరకెక్కిస్తున్న మూవీలోనూ అఖిల్ నటించాలనుకుంటున్నారట. దీని స్టోరీ ప్రస్తుతానికి రెడీగా ఉన్నప్పటికీ, షూట్​కు కాస్త ఆలస్యమయ్యేలా ఉందని టాక్. స్టార్ డైరెక్టర్ మోహన్ రాజాతోనూ గతంలో ఒక సినిమా అనుకున్నారు కానీ అది పట్టాలెక్కలేదు.

సినీ ఇండస్ట్రీలోకి అఖిల్ వచ్చి సుమారు ఏడేళ్లు అవుతున్నా కూడా ఇప్పటికీ ఈ కుర్ర హీరో ఖాతాలో ఒక్క బ్లాక్​బస్టర్​ కూడా పడలేదు. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' మాత్రమే ఒకటే డీసెంట్ టాక్ అందుకుంది. దీంతో అఖిల్ అభిమానులు ఆయన స్ట్రాంగ్ కమ్​బ్యాక్ కోసం తీవ్రంగా ఎదురుచూస్తున్నారు. ఈ మూడూ సక్సెస్​ అయ్యి అఖిల్ కెరీర్​ దూసుకెళ్లాని ఆశిస్తున్నారు.

అఖిల్ నెక్ట్స్ ప్రాజెక్ట్​కు రంగం సిద్ధం- షూటింగ్​కు ముహూర్తం ఫిక్స్!

అప్​డేట్స్ ఊసే ఎత్తని యంగ్​ హీరోలు - ఇంకెప్పుడు చెప్తారో ?

ABOUT THE AUTHOR

...view details