Gold Rate Today October 15, 2024 :దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. సోమవారం 10 గ్రాముల బంగారం ధర రూ.78,265 ఉండగా, మంగళవారం నాటికి రూ.265 తగ్గి రూ.78,000కు చేరుకుంది. సోమవారం కిలో వెండి ధర రూ.92,685 ఉండగా, మంగళవారం నాటికి రూ.355 తగ్గి రూ.92,330కు చేరింది.
Gold Price In Hyderabad October 15, 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.78,000గా ఉంది. కిలో వెండి ధర రూ.92,330గా ఉంది.
Gold Price In Vijayawada October 15, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.78,000గా ఉంది. కిలో వెండి ధర రూ.92,330గా ఉంది.
Gold Price In Visakhapatnam October 15, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.78,000గా ఉంది. కిలో వెండి ధర రూ.92,330గా ఉంది.
Gold Price In Proddatur October 15, 2024 :ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.78,000గా ఉంది. కిలో వెండి ధర రూ.92,330గా ఉంది.
గమనిక :పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర? Spot Gold Price October 15, 2024 :అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గాయి. సోమవారం ఔన్స్ గోల్డ్ ధర 2656 డాలర్లు ఉండగా, మంగళవారం నాటికి 12 డాలర్లు తగ్గి 2644 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 31.13 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే? Cryptocurrency News October 15, 2024 : మంగళవారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ భారీ లాభాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ
ప్రస్తుత ధర
బిట్‌కాయిన్
రూ.42,55,004
ఇథీరియం
రూ.1,65,000
టెథర్
రూ.76.55
బైనాన్స్ కాయిన్
రూ.44,000
సొలోనా
రూ.8,330
స్టాక్ మార్కెట్ అప్డేట్స్ Stock Market Today October 15, 2024 :మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యి, క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వస్తుండడం సహా, ప్రధాన కంపెనీలు త్రైమాసిక ఫలితాలు ప్రకటించనున్న నేపథ్యంలో మదుపరులు కాస్త ఆచితూచి వ్యవహరిస్తుండడమే ఇందుకు కారణం.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 202 పాయింట్లు నష్టపోయి 81,777 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 69 పాయింట్లు కోల్పోయి 25,058 వద్ద ట్రేడవుతోంది.
రూపాయి విలువ Rupee Open October 15, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 2 పైసలు తగ్గింది. ప్రస్తుతం అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.84.07గా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు Petrol And Diesel Prices October 15, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.39గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.
ముడిచమురు ధరలు Brent Crude Oil Prices October 15, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు 2.98 శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్ ముడి చమురు ధర 75.15 డాలర్లుగా ఉంది.