ETV Bharat / business

ఆధార్ ఫ్రీ అప్డేట్, స్పెషల్‌ FDల లాస్ట్ డేట్స్- డిసెంబర్ డెడ్​లైన్స్ ఇవే! - DECEMBER FINANCIAL DEADLINES

డిసెంబరులో పూర్తి చేయాల్సిన ఆర్థిక సంబంధిత పనులు ఇవే!

december dead lines
december dead lines (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 28, 2024, 5:24 PM IST

December Financial Deadlines : మరో రెండు రోజుల్లో రానున్న డిసెంబర్‌- సంవత్సరానికి మాత్రమే చివరి నెల కాదు, కొన్ని ఆర్థిక సంబంధిత వ్యవహారాలకు కూడా డెడ్‌ లైన్‌. ఆధార్‌ ఉచిత అప్డేట్, స్పెషల్‌ ఎఫ్​డీల గడువులు డిసెంబర్​లోనే ముగియనున్నాయి. క్రెడిట్‌ కార్డులకు సంబంధించిన కొన్ని మార్పులు రానున్నాయి. అందుకే ఓసారి డిసెంబర్​తో ముగియనున్న ఆర్థిక సంబంధిత వ్యవహారాలేవో తెలుసుకుందాం.

ఆధార్ ఉచిత అప్డేట్​కు డిసెంబరు 14 ఆఖరి తేదీ
ఆధార్ కార్డు యూజర్లకు myAadhaar పోర్టల్ ద్వారా తమ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు డిసెంబరు 14తో ముగియనుంది. లేదంటే గడువు తర్వాత ఆధార్‌ కేంద్రాల్లో రూ.50 చెల్లించి అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఐడీబీడీ ఎఫ్​డీ
300, 375, 444, 700 రోజుల గడువు ఉన్న స్పెషల్ డిపాజిట్ ఎఫ్​డీలను ఐడీబీఐ అందిస్తోంది. ఆయా ఎఫ్​డీలపై సాధారణ పౌరులకు వరుసగా 7.05, 7.25, 7.35, 7.20 శాతం వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజన్లకు మరో 50 బేసిస్ పాయింట్లు అదనంగా లభిస్తాయి. ఐడీబీఐ బ్యాంక్‌ తీసుకొచ్చిన ఉత్సవ్‌ స్పెషల్‌ డిపాజిట్‌ గడువు డిసెంబర్‌ 31తో ముగియనుంది.

పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ స్పెషల్ ఎఫ్​డీ
పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌ స్పెషల్‌ ఎఫ్​డీ స్కీములు డిసెంబర్‌ 31తో ముగియనున్నాయి. సాధారణ పౌరులకు 222 రోజులకు 6.30శాతం, 333 రోజులకు 7.20 శాతం, 444 రోజులకు 7.30 శాతం, 555 రోజులకు 7.45శాతం, 777 రోజులకు 7.25 పర్సెంటెజీ, 999 రోజులకు 6.65శాతం చొప్పున వడ్డీ లభిస్తుంది.

క్రెడిట్ కార్డుల రూల్స్​ మార్పులు
ఇక్సిగో ఏయూ క్రెడిట్‌ కార్డుకు సంబంధించి ఏయూ స్మాల్‌ పైనాన్స్‌ బ్యాంక్‌ చేపట్టిన మార్పులు డిసెంబర్‌ 22 నుంచి అమల్లోకి రానున్నాయి. ఎడ్యుకేషనల్‌, అద్దె, బీబీపీఎస్ ప్రభుత్వ చెల్లింపులపై ఇకపై రివార్డు పాయింట్లు ఉండవు. అలాగే అంతర్జాతీయ లావాదేవీలపై రివార్డు పాయింట్లను ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఉపసంహరించుకుంది.

యాక్సిస్ బ్యాంకు
యాక్సిస్‌ బ్యాంక్‌ కూడా క్రెడిట్ కార్డుల విషయంలో మార్పులు తీసుకొచ్చింది. కొన్ని క్రెడిట్‌ కార్డులపై ఫైనాన్స్‌ ఛార్జీలను 3.6 శాతం నుంచి 3.75 శాతానికి పెంచింది. చెక్ రిటర్న్ లేదా ఆటో డెబిట్ రివర్సల్ కోసం విధించే కనీస రుసుము రూ.450 నుంచి రూ.500కు పెంచింది. అలాగే ఐసీఐసీఐ బ్యాంకు శాఖల్లో నగదు చెల్లింపు రుసుములను రూ. 100 నుంచి రూ. 175కు పెంచింది. యాక్సిస్ బ్యాంక్‌ చేపట్టిన మార్పులు డిసెంబర్‌ 20న అమల్లోకి రానున్నాయి.

బిలేటెడ్ ఇన్​కమ్ ట్యాక్స్
ఏదైనా కారణం వల్ల గత ఆర్థిక సంవత్సరానికి (2023-24) సంబంధించి రిటర్నులు దాఖలు చేయకపోయి ఉంటే డిసెంబర్‌ 31లోపు బిలేటెడ్‌ రిటర్నులు దాఖలు చేయవచ్చు. పెనాల్టీ చెల్లించి ఈ రిటర్నులు ఫైల్ చేయాలి.

పర్సనల్‌ లోన్‌పై పన్ను మినహాయింపులు - వీటి కోసం డబ్బులు ఖర్చు పెడితే క్లెయిమ్ చేసుకోవచ్చు!

అర్జెంట్​గా డబ్బులు కావాలా? షేర్స్ తాకట్టుపెట్టి లోన్ తీసుకోవచ్చు - ఎలాగో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.