Tollkatta Farm House Case : హైదరాబాద్ నగర శివారు ప్రాంతం రాజేంద్రనగర్‌లో పరిధిలోని పోలీసు దాడుల్లో తోల్కట్ట ఫామ్‌హౌస్‌లో పట్టుకున్న పందెం కోళ్లకు ఉప్పరపల్లి కోర్టులో ఈరోజు వేలం పాట నిర్వహించారు. మొత్తం పందెం 84 కోళ్లకు ఏకంగా రూ. 16 లక్షల 65 వేలకు పందెం రాయుళ్లు వేలం పాటలో కైవసం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తోల్కట్ట ఫామ్‌హౌస్‌లో గత వారం క్రితం కోళ్ల పందెం నిర్వహిస్తున్న స్థావరంపై ఎస్ఓటి మొయినాబాద్ పోలీసులు దాడి నిర్వహించారు.

భారీగా పాట పాడిన పందెం రాయుళ్లు : ఆరోజు 61మందిపై కేసు నమోదు చేసి 61 కార్లు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దాంతో పాటు అక్కడున్న పందెం కోళ్లను స్వాధీన పరుచుకున్నారు. ఈరోజు రాజేంద్రనగర్ కోర్టులో కోళ్లను హాజరు పరిచారు జడ్జి సమక్షంలో పందెం కోళ్లకు వేలం పాట పాడారు. 10 కోళ్ల చొప్పున వేలం నిర్వహించారు. మొదటి రౌండ్‌కు రూ. 2 లక్షల 50 వేలు, రెండో రౌండ్‌కి రూ. 3 లక్షల 75 వేలు, మూడో రౌండ్‌కి రూ. లక్షా 15వేలు. ఇలా మొత్తం 8 రౌండ్లకు కలిపి రూ. 16 లక్షల 65 వేలు వచ్చాయి. ఎవరైతే పందెంలో పట్టుబడ్డారో వారే ఆ కోళ్లను కైవసం చేసుకోవడం గమనార్హం.
హైదరాబాద్‌లో సీక్రెట్‌గా కోడి పందేలు - పందెం రాయుళ్లకు పోలీసుల ఝలక్!