ETV Bharat / offbeat

ఇలా సరికొత్త పద్ధతిలో "ఎగ్​ రైస్"! - బిర్యానీకి ఏ మాత్రం తగ్గని టేస్ట్! - EGG FRIED RICE

- ఇంటిల్లిపాదీ లొట్టలేసుకుంటూ తినడం పక్కా!

Egg Fried Rice Recipe
Egg Fried Rice (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 20, 2025, 1:54 PM IST

Egg Fried Rice Recipe : మనలో చాలా మంది కర్రీ చేసే టైమ్ లేనప్పుడు త్వరగా అయిపోతుందని ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటుంటారు. అయితే, ఎప్పుడూ రెగ్యులర్​గా​ చేసుకునేలా కాకుండా ఓసారి ఈ స్టైల్​లో "ఎగ్​ రైస్" చేసి చూడండి. టేస్ట్ అద్భుతంగా ఉండి పచ్చిమిర్చి, పుదీనా ఫ్లేవర్స్​తో నోరూరిస్తుంది. ఇలా రోజూ చేసి పెట్టినా పిల్లల నుంచి పెద్దల వరకు లొట్టలేసుకుంటూ తింటారు. బిర్యానీ కంటే కూడా రుచికరంగా ఉంటుంది ఈ రైస్! ఎవరైనా దీన్ని సింపుల్​గా చేసుకోవచ్చు. మరి, ఈ సూపర్ టేస్టీ రెసిపీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అన్నది ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • బాస్మతి రైస్ - 1 కప్పు
  • ఎగ్స్ - 4
  • ఉల్లిపాయ - 1(మీడియం సైజ్​ది)
  • పుదీనా - కొద్దిగా
  • కొత్తిమీర - కొద్దిగా
  • పచ్చిమిర్చి - 5
  • వెల్లుల్లి రెబ్బలు - 4
  • అల్లం - అంగుళం ముక్క
  • నూనె - 3 టేబుల్​స్పూన్లు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • మిరియాల పొడి - 1 టీస్పూన్
  • ఆవాలు - అరటీస్పూన్
  • జీలకర్ర - అరటీస్పూన్
  • కరివేపాకు - 1 రెమ్మ
  • పసుపు - అరటీస్పూన్
  • గరంమసాలా - 1 టీస్పూన్

స్ట్రీట్​ స్టైల్ "వెజ్​ ఫ్రైడ్​ రైస్​" - పిల్లలు మళ్లీ కావాలంటారు!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా బాస్మతి రైస్​ని శుభ్రంగా కడిగి కుక్కర్​లోకి తీసుకోవాలి. ఆపై అందులో 2 కప్పుల వరకు వాటర్ పోసి 10 నుంచి 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి.
  • ఆ తర్వాత హై ఫ్లేమ్ మీద 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అనంతరం ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి 1 టీస్పూన్ ఆయిల్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం ద్వారా రైస్ చల్లారాక కూడా పొడిపొడిలాడుతూ ఉంటుంది.
  • ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని పుదీనా, కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు, సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చిని తుంపి వేసుకొని అన్నింటినీ ఒకసారి కలిపి పేస్ట్​లా గ్రైండ్ చేసుకోవాలి.
  • అనంతరం స్టౌపై పాన్ పెట్టుకొని 2 టేబుల్​స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక ఎగ్స్​ని పగులకొట్టి వేసుకోవాలి. అలాగే ఉప్పు, మిరియాల పొడి వేసుకొని పొరటులా లైట్​గా వేయించుకొని పక్కకు తీసుకోవాలి.
  • ఆ తర్వాత అదే పాన్​లో అదనంగా మరో టేబుల్​స్పూన్ ఆయిల్​ని వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, ఆవాలు వేసుకొని చిటపటమనే వరకు వేయించుకోవాలి.
  • అవి వేగాక సన్నని ఉల్లిపాయ తరుగు వేసుకొని కాస్త మెత్తబడే వరకు వేయించాలి. అలా వేయించుకునేటప్పుడే కరివేపాకు వేసుకోవాలి.
  • ఆనియన్స్ వేగాక పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత మిక్సీ పట్టుకున్న పుదీనా పేస్ట్​ని యాడ్ చేసుకొని లో-ఫ్లేమ్ మీద రెండు నిమిషాలపాటు వేగనివ్వాలి.
  • అనంతరం వేయించి పక్కన పెట్టుకున్న గుడ్డు పొరటును వేసి మరో నిమిషంపాటు కలుపుతూ వేయించుకోవాలి. ఆ తర్వాత ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్​, గరంమసాలా, రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా సన్నని కొత్తిమీర తరుగు వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి.
  • ఆపై మీడియం ఫ్లేమ్ మీద రైస్ బాగా వేడి అయ్యే వరకు కుక్ చేసుకొని దింపేసుకుంటే చాలు. అంతే, ఘుమఘుమలాడే "ఎగ్​ రైస్" రెడీ!

ఇంట్లో కూరగాయలు లేవా ? - ఓసారి "లెమన్​ పెప్పర్​ రసం రైస్" చేయండి! - తృప్తిగా తినచ్చు!!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.