Margadarsi Chit Fund 122nd Branch Opened in Karnataka : ప్రజల ఆర్థిక అవసరాలకు ఆలంబనగా నిలుస్తూ దక్షిణాదిలోని నాలుగు రాష్ట్రాల్లో చందాదారుల అభిమానం చూరగొంటున్న మార్గదర్శి చిట్‌ఫండ్ తన 122వ శాఖను ఇవాళ కర్ణాటకలోని చిత్రదుర్గలో ప్రారంభించింది. సంస్థ ఎండీ శైలజా కిరణ్ నూతన శాఖను ప్రారంభించారు. పూజా కార్యక్రమాలు నిర్వహించి తొలి ఖాతాదారునికి రసీదు అందజేశారు. చిత్రదుర్గలో నూతనశాఖ ఏర్పాటు చేయడంపై చందాదారులు హర్షం వ్యక్తం చేశారు. మార్గదర్శిపై తమకు ఉన్న నమ్మకాన్ని వివరించారు. త్వరలో మరో ఐదారు శాఖలు ప్రారంభించే ప్రణాళికల్లో ఉన్నట్లు మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్గదర్శి చిట్స్ కర్ణాటక విభాగం డైరెక్టర్ లక్ష్మణరావు, మార్గదర్శి ఉపాధ్యక్షుడు బలరామకృష్ణ, జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు.
"మేము 4 రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో శాఖలున్నాయి. ఇవాళ ప్రారంభించిన చిత్రదుర్గ బ్రాంచ్ కర్ణాటకలో 26వ శాఖ. నాలుగు రాష్ట్రాల్లో కలిపి చూస్తే ఇది 122వ శాఖ. మరో ఐదారు శాఖలు ప్రారంభించే ప్రణాళికల్లో ఉన్నాం. ఈ ఏడాది గత నెలలో మా టర్నోవర్ రూ.10 వేల కోట్లు దాటింది. మాకు రెండున్నర లక్షల మంది చందాదారులు ఉన్నారు."- శైలజా కిరణ్, మార్గదర్శి ఎండీ
"నేను చాలా సంవత్సరాలు నుంచి మార్గదర్శి చిట్‌ఫండ్ మెంబర్‌గా ఉన్నాను. నా పిల్లల ఎడ్యుకేషన్‌కు, అలాగే కుటుంబ అభివృద్ధికి చాలా సపోర్ట్‌గా నిలించింది. నా కుటుంబంపై ఎంత నమ్మకం ఉందో మార్గదర్శిపై అంతే నమ్మకం ఉంది."- మార్గదర్శి చిట్‌ఫండ్ ఖాతాదారుడు
"నేను మూడు సంవత్సరాలు నుంచి మార్గదర్శిలో చిట్టి కడుతున్నాను. మా హౌస్‌లోన్ తీర్చడానికి మార్గదర్శి సహాయం చేసింది."- మార్గదర్శి చిట్‌ఫండ్ ఖాతాదారురాలు
ఆభరణాల కొనుగోలు విషయంలో నమ్మకం చాలా ముఖ్యం : మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్