IPL 2025 Opening Pairs : ఐపీఎల్ మెగా వేలం ఇటీవలే ముగిసింది. జెద్దా వేదికగా ఆది, సోమవారాల్లో జరిగిన ఈ మెగా ఆక్షన్ అంచనాలకు మించి సాగింది. మొత్తంగా 182 మంది ఆటగాళ్ల కోసం 10 ఫ్రాంఛైజీలు కలిపి రూ.639.15 కోట్లు ఖర్చుపెట్టాయి. ఇందులో 62 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఆటగాళ్ల నైపుణ్యం, సామర్థ్యం, స్టార్ డమ్ ఆధారంగా వారిపై డబ్బు వెచ్చించి దక్కించుకున్నాయి. తమ జట్టును మరింత పటిష్ఠంగా మార్చుకున్నాయి.
అయితే ఇప్పుడు అన్నీ జట్ల ఓపెనింగ్ జోడీలపై ఓ క్లారిటీ వచ్చింది! టీ20ల్లో ఓపెనింగ్ పెయిర్ ఎంతో ముఖ్యం. పవర్‌ప్లేలో ఓపెనర్లు తమ విధ్వంసకర ఆటతో మంచి ఆరంభాన్ని అందిస్తే జట్టుకు మంచు ఊపు వస్తుంది. ప్రత్యర్థి జట్టు ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించవచ్చు. ముంబయి ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీలు 2024 సీజన్లో తమ జట్లలో ఓపెనర్లుగా వ్యవహరించిన వారిలో కనీసం ఒక్కరినైనా ఈ సీజన్ కోసం రిటైన్ చేసుకున్నారు.
ప్రస్తుతం జరిగిన మెగా వేలంలో జాస్ బట్లర్ ఎక్కువ ధర పలికిన రెగ్యులర్ ఓపెనర్‌గా నిలిచాడు. అతడిని గుజరాత్ టైటాన్స్ రూ.15.75 కోట్లకు సొంతం చేసుకుంది. మొత్తంగా ఈ సీజన్ కోసం ఏ జట్టు నుంచి ఎవరెవరు ఓపెనర్లుగా బరిలోకి దిగుతున్నారోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో పది ఫ్రాంచైజీల ఓపెనర్లు జాబితా (అంచనా), వాళ్ల కోసం ఫ్రాంఛైజీలు ఎంత ఖర్చు చేశారో వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
- కోల్‌కతా నైట్ రైడర్స్ : సునీల్ నరైన్ (రూ. 12 కోట్లు) - క్వింటన్ డికాక్ (రూ. 3.60 కోట్లు)
- సన్‌రైజర్స్ హైదరాబాద్ : అభిషేక్ శర్మ (రూ. 14 కోట్లు) - ట్రావిస్ హెడ్ (రూ. 14 కోట్లు)
- రాజస్థాన్ రాయల్స్ : యశస్వీ జైశ్వాల్ (రూ. 18 కోట్లు) - సంజూ శాంసన్ (రూ. 18 కోట్లు)
- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : విరాట్ కోహ్లీ (రూ. 21 కోట్లు) - ఫిలిప్ సాల్ట్ (రూ. 11.50 కోట్లు)
- ముంబయి ఇండియన్స్ : రోహిత్ శర్మ (రూ. 16.30 కోట్లు) - విల్ జాక్స్ (రూ. 5.25 కోట్లు)
- చెన్నై సూపర్ కింగ్స్ : రుతురాజ్ గైక్వాడ్ (రూ. 18 కోట్లు) - డెవాన్ కాన్వే (రూ. 6.25 కోట్లు)
- పంజాబ్ కింగ్స్ : ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (రూ. 4 కోట్లు) - జోస్ ఇంగ్లిష్ (రూ. 2.60 కోట్లు)
- దిల్లీ క్యాపిటల్స్ : కేఎల్ రాహుల్ (రూ. 14 కోట్లు) - జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ (రూ. 9 కోట్లు)
- లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ : ఎయిడెన్ మార్క్‌రమ్ (రూ. 2 కోట్లు)- మిచెల్ మార్ష్ (రూ. 3.40 కోట్లు)
- గుజరాత్ టైటాన్స్ : శుభ్‌మన్ గిల్ (రూ. 16.5 కోట్లు) - జోస్ బట్లర్ (రూ. 15.75 కోట్లు).
IPL 2025 వేలం - 182 మంది క్రికెటర్స్ సోల్డ్ - రూ.639.15 కోట్ల ఖర్చు