EPFO UAN Activation :ఈపీఎఫ్ఓ (EPFO) ఖాతా ఉన్నవారికి అలర్ట్. యూఏఎన్ (UAN) యాక్టివేషన్, బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ సీడింగ్‌కు సంబంధించిన గడువును డిసెంబర్ 15 వరకు పొడిగించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగాల్లో చేరిన వారి యూఏఎన్ యాక్టివ్‌గా ఉంచుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. అలాగే ఎంప్లాయ్‌మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్(ELI) స్కీమ్ బెనిఫిట్స్ పొందేందుకు యూఏఎన్ యాక్టివ్‌లో ఉంచుకోవాలని సూచించింది. ఈ క్రమంలో ఈఎల్ఐ అంటే ఏమిటి? దాని ప్రయోజనాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఈఎల్ఐ పథకం అంటే ఏమిటి?
కేంద్ర బడ్జెట్ 2023-24లో ఎంప్లాయ్‌మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ (ఈఎల్ఐ) పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా ఉద్యోగుల ఆధార్‌తో లింక్ అయిన బ్యాంకు అకౌంట్‌కు నేరుగా నగదు బదిలీ ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.
నెల వేతనం ప్రోత్సాహకం
ఇటీవల బడ్జెట్‌లో మూడు ఈఎల్‌ఐ పథకాలను కేంద్రం ప్రకటించింది. స్కీం- ఏ లో భాగంగా తొలిసారి ఉద్యోగాల్లో చేరిన వారిని ఈపీఎఫ్‌ఓ ఖాతాల ఆధారంగా గుర్తించి, వారికి ఒక నెల వేతనాన్ని ప్రోత్సాహకంగా అందిస్తారు. దీన్ని రూ.15 వేల వరకు మూడు వాయిదాల్లో ఇస్తారు. దీనికి గరిష్ఠంగా నెలకు రూ.లక్షలోపు వేతనం ఉన్నవారే అర్హులు.
ఉద్యోగి, కంపెనీకి ప్రయోజనం
అలాగే, స్కీం-బీలో ఉత్పాదక రంగంలో ఉపాధి కల్పనను ప్రోత్సహించేందుకు ఉద్యోగికి, యజమానికి కూడా ప్రోత్సాహకాలు ఉంటాయి. ఇందులో భాగంగా తొలిసారి ఉద్యోగాల్లో చేరేవారికి, వారి యజమానులకు కూడా తొలి నాలుగేళ్లపాటు నిర్ధరిత వేతన స్కేళ్లలో ఈపీఎఫ్‌లో చందాలను ప్రోత్సాహకంగా అందిస్తారు. ఉద్యోగంలో చేరిన రెండో ఏడాది 24 శాతం వేతనం, మూడో ఏడాది 16 శాతం, నాలుగో ఏడాది 8 శాతం వేతనాన్ని ప్రోత్సహకంగా ఇస్తారు.