ETV Bharat / sports

ICC 'ప్లేయర్ ఆఫ్ ద మంత్​'గా బుమ్రా- ఆసీస్​ కెప్టెన్​ కమిన్స్​ను వెనక్కి నెట్టిన స్టార్ పేసర్ - ICC MEN PLAYER OF MONTH

బుమ్రా ఖాతాలో మరో రికార్డ్- ఐసీసీ 'ప్లేయర్ ఆఫ్​ ది మంత్​' అవార్డ్​కు ఎంపిక

ICC Men Player of Month Bumrah
ICC Men Player of Month Bumrah (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 14, 2025, 5:36 PM IST

ICC Men Player of Month Bumrah : ఆస్ట్రేలియా పర్యటనలో భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అద్భుతమైన ప్రదర్శనకు 'ప్లేయర్​ ఆఫ్​ ది మంత్​'గా ఎంపికయ్యాడు. ​అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మంగళవారం ప్రకటించిన ఫలితాల్లో పురషుల విభాగంలో బుమ్రా ఈ అవార్డ్​ను గెలుచుకున్నాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్​ను వెనక్కి నెట్టి మరీ బుమ్రా బెస్ట్ ప్లేయర్ ఆఫ్​ ద మంత్​ అవార్డ్​ను అందుకున్నాడు.

ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో బుమ్రా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. గతేడాది డిసెంబర్​లో జరిగిన మూడు టెస్ట్​ల్లో 14.22 సగటు రేటులో 22 వికెట్లు సాధించాడు. తరువాత జరిగిన నాలుగు, ఐదు మ్యాచ్​ల్లో తొమ్మిది వికెట్లు తీశాడు. అదే సమయంలో అత్యధిక రేటింగ్ పాయింట్స్ సాధించిన భారత బౌలర్​గా చరిత్ర సృష్టించాడు. మరోవైపు ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్​-గావస్కర్​ ట్రోఫీలో అద్భుతంగా రాణించాడు. అయితే సిడ్నీలో జరిగిన చివరి టెస్ట్​ రెండో ఇన్నింగ్స్​లో వెన్ను నొప్పితో బౌలింగ్​కు దూరం అయ్యాడు. ఈ సిరీస్​లో బుమ్రా మొత్తం 32 వికెట్లు తీశాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్​ను దక్కించుకున్నాడు. ఈ అద్భుతమై ప్రదర్శనతో బుమ్రా ఐసీసీ ప్లేయర్ ఆఫ్​ ద మంత్​గా నిలిచాడు.

బుమ్రా@ 200- తొలి భారత బౌలర్​గా రికార్డ్
ఇదే సమయంలో బుమ్రా అత్యధిక రేటింగ్ పాయింట్స్ సాధించిన భారత బౌలర్​గా చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో 200 వికెట్ల మైలురాయి అందుకున్నాడు. బోర్డర్​-గావస్కర్ ట్రోఫీలో రెండో ఇన్నింగ్స్​ 33.2 వద్ద ట్రావిస్ హెడ్ వికెట్ పడగొట్టిన బుమ్రా- 200 మార్క్ దాటాడు. అలాగే అత్యంత వేగంగా 200 వికెట్ల మైలురాయిని చేరుకున్న భారత బౌలర్‌గా నిలిచాడు. ఇక టెస్టుల్లో భారత్ తరఫున 200+ వికెట్లు పడగొట్టిన 12వ బౌలర్​గా బుమ్రా నిలిచాడు.

కాగా, ఓవరాల్​గా ఈ ఘనత అందుకున్న నాలుగో పేసర్ బుమ్రా కావడం విశేషం. అతడి కెరీర్‌లో 44వ టెస్టు ఆడుతున్న బుమ్రా, కేవలం 8,484 బంతుల్లోనే 200+ వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు. ఈ లిస్ట్​లో పాక్ మాజీ పేసర్ వకార్ యూనిస్ 7,725 బంతుల్లో తీసి అగ్రస్థానంలో ఉన్నాడు. సౌతాఫ్రికా పేసర్లు డేల్ స్టెయిన్ (7,848), కగిసో రబాడ (8,153) తర్వాత స్థానాల్లో ఉన్నారు. అయితే, మ్యాచుల పరంగా స్పిన్నర్ అశ్విన్ (37 మ్యాచులు) భారత్‌ తరఫున ముందున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.