Maha Kumbh Mela 2025 : ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా ఘనంగా ఆరంభమైంది. గంగా, యమునా, సరస్వతీ నదుల సంగమ ప్రదేశమైన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు పోటెత్తారు. పుష్య పౌర్ణమి అయిన సోమవారం తెల్లవారుజాము నుంచే లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమానికి చేరుకొని పవిత్ర స్నానాలు చేస్తున్నారు. భక్తుల పూజలతో ఈ ప్రాంతం దేదీప్యమానంగా వెలుగుతోంది. ఉదయం 7.30 గంటల సమయానికే దాదాపు 35 లక్షల మంది ఇక్కడ పవిత్ర స్నానాలు ఆచరించారని ప్రయాగ్‌రాజ్ అధికారులు వెల్లడించారు.
దేశవిదేశాల నుంచి తరలివస్తున్న భక్తులు
45 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి కోట్ల మంది భక్తులు, పర్యటకులు వస్తున్నారు. సుమారుగా 35 కోట్ల మంది వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీంతో భక్తులకు మెరుగైన సౌకర్యాలతో పాటు భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. నదిలో నిరంతరం పహారా కాసేందుకు ప్రత్యేకంగా తేలియాడే పోలీసుస్టేషన్‌ను ఏర్పాటుచేశారు. అటు చిన్నచిన్న పడవలపై భద్రతా సిబ్బంది పెట్రోలింగ్ చేస్తున్నారు.
#MahaKumbhMela2025 | Prayagraj, Uttar Pradesh: Thousands of devotees take a holy dip in Triveni Sangam - a sacred confluence of rivers Ganga, Yamuna and 'mystical' Saraswati as today, January 13 - Paush Purnima marks the beginning of the 45-day-long #MahaKumbh2025
— ANI (@ANI) January 13, 2025
(Source:… pic.twitter.com/HE7sV7qD3C
ఆధ్యాత్మిక వారసత్వం : మోదీ
మహా కుంభమేళా ప్రారంభమైన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘భారతీయ విలువలు, సంస్కృతిని గౌరవించే కోట్లాది మందికి ఇది చాలా ప్రత్యేకమైన రోజు. ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా ప్రారంభమైంది. విశ్వాసం, భక్తి, సంప్రదాయాల సంగమంతో ఎంతో మందిని ఒకచోట చేర్చింది. మన దేశ ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఈ వేడుక ప్రతిబింబిస్తుంది. పవిత్ర స్నానాలు ఆచరించి, భగవంతుడి ఆశీస్సులు తీసుకునేందుకు లెక్కలేనంతమంది రావడం ఎంతో సంతోషంగా ఉంది’’ అని మోదీ రాసుకొచ్చారు.
A very special day for crores of people who cherish Bharatiya values and culture!
— Narendra Modi (@narendramodi) January 13, 2025
Maha Kumbh 2025 commences in Prayagraj, bringing together countless people in a sacred confluence of faith, devotion and culture. The Maha Kumbh embodies India’s timeless spiritual heritage and…
భారీ భద్రతా ఏర్పాట్లు
10,000 ఎకరాల్లో కుంభమేళాకు ఏర్పాట్లు జరిగాయని, ఏ సమయంలోనైనా 50 లక్షల మంది నుంచి కోటి మంది ఉండగలిగేలా సౌకర్యాలను కల్పించామని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే వెల్లడించారు. ఇది మతపరమైన కార్యక్రమం మాత్రమే కాదని, సామాజిక, ఆధ్యాత్మిక ఐక్యతకు చిహ్నమని పేర్కొన్నారు. అలాగే భక్తులకు సౌకర్యాల కల్పన కోసం ఆధునిక సాంకేతిక సహకారాన్ని విస్తృతంగా వాడుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
- యాత్రికులకు ఇబ్బంది లేకుండా 1.6 లక్షల టెంట్లను, 1.5 లక్షల మరుగు దొడ్లను నిర్మించారు.
- భద్రత కోసం 55 పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. 45,000 మంది పోలీసులను మోహరించారు.
- పారా మిలటరీ బలగాలతో భద్రతను కట్టుదిట్టం చేశాయి. సీసీ కెమేరాలు, డ్రోన్లతో నిఘా పెట్టారు. అశ్వక దళాన్ని కూడా మోహరించారు. కుంభమేళా కోసం ప్రత్యేకంగా సీనియర్ ఐపీఎస్‌లను పర్యవేక్షక అధికారులుగా నియమించారు.
- సాధువులకు సంబంధించిన 13 అఖాడాలు కుంభమేళాలో భాగం కానున్నాయి.
- ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాధువులు, సాధ్వీలు, నాగా సాధువులు, కల్పవాసీలు, భక్తులకు స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
- ఆదివారం నాటికే లక్షల మంది భక్తులు ప్రయాగ్‌రాజ్ చేరుకున్నారు. శనివారం 25 లక్షల మంది పవిత్ర స్నానాలు చేశారు.
- తెలుగుతోపాటు ప్రాంతీయ, అంతర్జాతీయ భాషల్లోనూ సేవలందించే కాల్ సెంటర్లను ఏర్పాటు చేశారు.
#WATCH | Prayagraj, Uttar Pradesh: Devotees took a holy dip in Triveni Sangam - a sacred confluence of rivers Ganga, Yamuna and 'mystical' Saraswati as today, January 13 - Paush Purnima marks the beginning of the 45-day-long #MahaKumbh2025
— ANI (@ANI) January 13, 2025
(Earlier visuals) pic.twitter.com/fVmy3YyUkN
#MahaKumbhMela2025 | Uttar Pradesh: A large number of people arrive in Prayagraj to take a holy dip in Triveni Sangam - a sacred confluence of rivers Ganga, Yamuna and 'mystical' Saraswati as today, January 13 - Paush Purnima marks the beginning of the 45-day-long #MahaKumbh2025 pic.twitter.com/pXzeEr4SgF
— ANI (@ANI) January 13, 2025
#WATCH | Uttar Pradesh Police patrols on horses to ensure the safety and security of devotees as the 45-day #Mahakumbh2025 in Prayagraj city is estimated to attract over 40 crore people - the largest ever gathering of humans. pic.twitter.com/lWsdefjGn5
— ANI (@ANI) January 13, 2025
మహా కుంభమేళా కోసం 13,000 రైళ్లు
జనవరి 13న పుష్యపౌర్ణమి, 14న మకర సంక్రాంతి, 29న మౌని అమావాస్య, ఫిబ్రవరి 3న వసంత పంచమి, ఫిబ్రవరి 12న మాఘ పౌర్ణమి, 26న మహా శివరాత్రి ఉన్నాయి. కనుక ఈ పర్వదినాల్లో కుంభమేళాకు భారీగా భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించే అవకాశం ఉంటుంది. అందుకే మహా కుంభమేళాకు తరలివచ్చే కోట్ల మంది భక్తుల కోసం రైల్వేశాఖ 3000 ప్రత్యేక రైళ్లతోపాటు మొత్తంగా 13,000 రైళ్లను నడుపుతోంది. సుమారు 2 కోట్ల మంది రైళ్ల ద్వారా వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. 9 కీలకమైన రైల్వే స్టేషన్లలో 560 టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేశారు.