Weather Changes Health Tips in Telugu : రాష్ట్రంలో ఓ వైపు పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం, మరో వైపు రాత్రి వేళ చలి తీవ్రతతో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. శీతాకాలం ముగిసి వేసవి ఆరంభం అయ్యే సమయంలో వ్యాధులు వెంటాడే ప్రమాదం ఉంది. పౌష్టికాహారం తీసుకోవడం, వ్యాయామం, యోగాసనాలను అలవాటుగా చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు అంటున్నారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా జీవన శైలిలో మార్పులు చేసుకోవాలని వారు సూచినలు చేస్తున్నారు.
ఆహారపు అలవాట్లు : సీజన్ మారినప్పుడల్లా మైక్రో ఆర్గానిక్స్, బ్యాక్టీరియాతో వ్యాధులు విజృంభిస్తుంటాయి. చిన్న పిల్లలు, వృద్ధులు బయటి ఆహారం జోలికి వెళ్లకపోవడమే ఉత్తమం. విటమిన్లు, పోషకాలతో కూడిన మన ఇంటి భోజనమే అన్ని విధాలా మంచిది. శరీరంలో నీటి శాతం పెంచే తాజా పండ్లను అధికంగా తీసుకోవాలి.
చిన్న పిల్లలు : పానీపూరి, జంక్ ఫుడ్, నూనెతో చేసిన వేపుళ్లు, హోటల్ పదార్థాలు తీసుకోవద్దు. మెదడు చురుగ్గా ఉండేలా డ్రై ఫూట్లు అధికంగా ఇవ్వాలి. వాల్‌నట్స్, బాదం అందించాలి. మజ్జిగ, పాలు తాగించాలి.
వృద్ధులు : త్వరగా జీర్ణం అయ్యే ఆహారం తీసుకోవడం ద్వారా అనారోగ్యం దరి చేరకుండా ఉంటుంది. మాంసాహారానికి బదులుగా శాఖాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. పెరుగు అన్నం చాలా మంచిది.
పిల్లలు, వృద్ధులు విటమిన్లు అధికంగా ఉండే ఆరెంజ్, ద్రాక్ష, జామ పండ్లు తీసుకోవాలి. సీజనల్ ఫలాలు తింటూ ఉండాలి. నీళ్ల శాతం ఎక్కువగా ఉండే బీర, సోర వంటి తాజా కూరగాయలు మేలు చేస్తాయి. బలవర్ధకమైన పప్పు దినుసులు అధికంగా తీసుకోవాలి.
వ్యాయామం : -
- ఆకస్మిక వాతావరణ మార్పులతో గాలిలో వేడి, తేమతో అనర్థాలు ఉంటాయి.
- ఈ టైంలో మధుమేహ, రక్తపోటు వ్యాధిగ్రస్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి.
- కణాల్లో రక్తం గడ్డ కట్టి కార్డియా వాస్కులర్ సమస్యలు తలెత్తుతాయి.
- క్రమం తప్పకుండా వాకింగ్‌తో పాటు వ్యాయామం చేయాలి.
- ముద్ర ప్రాణాయామం, సప్త వజ్రాసనం, త్రికోణాసనాలు వేయాలి.
చిన్న పిల్లలు భద్రం : -
- పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పిల్లల్లో వైరస్ తొందరగా విస్తరిస్తుంది.
- రోగ నిరోధక శక్తి తగ్గి తట్టు, కిచెన్ ఫాక్స్ సోకే అవకాశం ఉంది.
- కంటి సమస్యలతో పాటు టైఫాయిడ్ బారిన పడే ప్రమాదం ఉంది.
- ఈ లక్షణాలు ఉన్న పిల్లలను బడులకు పంపవద్దు.
- ఇంటి నుంచి బయటకు వెళ్లేటపుడు మాస్కు ధరించాలి.
వృద్ధుల్లో అప్రమత్తత అవసరం : ఈ సీజన్‌లో మార్పుతో పలు రకాల వ్యాధులు దండెత్తుతాయి. వృద్ధుల్లో ఇమ్యూనిటీ శాతం తగ్గి తొందరగా అస్వస్థతకు గురవుతుంటారు. దగ్గు, తీవ్ర జ్వరం, విరేచనాలు బాధిస్తుంటాయి. గొంతు నొప్పి ఉంటుంది. జీర్ణకోశ సమస్యలతో బాధ పడేవారు, గర్భిణులు జాగ్రత్తగా ఉండాలి. కొబ్బరి నీళ్లతో పాటు శరీరానికి సరిపడా నీళ్లు తీసుకోవాలి. చర్మ సమస్యలు ఎక్కవగా వస్తుంటాయి. దురదతో మొదలై తెల్లమచ్చలు ఏర్పడుతుంటాయి. వీపు, చేతులపై దద్దుర్లు వస్తుంటాయి.
జస్ట్ 10 నిమిషాలు ఇలా చేస్తే ఈజీగా బరువు తగ్గుతారట! స్పాట్ జాగింగ్ గురించి మీకు తెలుసా?
పిల్లలకూ పొట్టమీద "స్ట్రెచ్‌మార్క్స్" - ఎలా తగ్గించుకోవాలో తెలుసా?