ETV Bharat / technology

'ఏప్రిలియా టువోనో 457' బైక్​ లాంఛ్ డేట్ ఫిక్స్- ధర ఎంత ఉండొచ్చంటే? - APRILIA TUONO 457 LAUNCH TIMELINE

త్వరలో ఇండియన్ మార్కెట్లోకి 'టువోనో 457'- ధర, ఫీచర్ల వివరాలివే..!

Aprilia Tuono 457
Aprilia Tuono 457 (Photo Credit- Aprilia India)
author img

By ETV Bharat Tech Team

Published : Jan 14, 2025, 5:20 PM IST

Aprilia Tuono 457 Launch Timeline: ఇటాలియన్ బైక్ తయారీ సంస్థ ఏప్రిలియా తన కొత్త 'ఏప్రిలియా టువోనో 457' బైక్​ను భారత మార్కెట్లో విడుదల చేసేందుకు రెడీ అయింది. ఈ మేరకు ఈ మోటార్​సైకిల్​ను ఫిబ్రవరి మూడో వారంలో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఫిబ్రవరి 17 లేదా 18వ తేదీన దీని ధరలను ప్రకటిస్తామని కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

కంపెనీ ఈ మోటార్‌సైకిల్‌ను EICMA 2024లో ప్రదర్శించింది. 'ఏప్రిలియా టువోనో 457' అనేది 'RS 457' నేకెడ్ వెర్షన్. ఇది 'RS 457' మాదిరిగానే ఇంజిన్ అండ్ మెకానికల్ భాగాలను కలిగి ఉంటుంది. అయితే కంపెనీ ఈ కొత్త మోటార్​సైకిల్​ను 'RS 457' కంటే కాస్త తక్కువ ధరలోనే లాంఛ్ చేయొచ్చు.

మన భారత మార్కెట్లో 'RS 457' మోడల్ బైక్ రూ. 4.20 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో సేల్ అవుతోంది. ఇక ఈ కొత్త బైక్ డిజైన్ విషయానికొస్తే.. అప్పీయరెన్స్ పరంగా 'టువోనో 457' సింగిల్ హెడ్‌ల్యాంప్ సెటప్​తో రానుంది. దీనికి ఇరువైపులా బూమరాంగ్-స్టైల్ డేటైమ్ రన్నింగ్ లాంప్స్ (DRL) ఇన్‌స్టాల్ అయి ఉంటాయి.

ఏప్రిలియా టువోనో 457 డిజైన్: ఈ మోటార్ సైకిల్ హెడ్‌ల్యాంప్ కింద వింగ్‌లెట్స్​ను కూడా కలిగి ఉంది. ఇది కాకుండా మోటార్​సైకిల్ కాస్మెటికల్​గా RS 457ను పోలి ఉంటుంది. అయితే ఇందులోని వన్-పీస్ హ్యాండిల్ బార్, రియర్ సెట్ ఫుట్‌పెగ్స్​, ఆర్చ్డ్ సీటుతో ఈ బైక్ రైడింగ్ వైఖరి 'RS 457' కంటే కొద్దిగా భిన్నంగా ఉంటుంది. ఈ మోటార్ సైకిల్ మూడు రైడింగ్ మోడ్స్​ను కలిగి ఉంటుంది. అంతేకాక ఇందులో 'RS 457' మాదిరిగా ట్రాక్షన్ కంట్రోల్, ABS వంటి ఇతర రైడర్ అసిస్ట్‌లు కూడా ఉంటాయి.

Aprilia Tuono 457
Aprilia Tuono 457 (Photo Credit- Aprilia India)

హార్డ్‌వేర్: ఈ మోటార్ సైకిల్ హార్డ్‌వేర్ గురించి మాట్లాడుకుంటే టువోనో 457 ముందు భాగంలో అదే ప్రీలోడ్ అడ్జస్టబుల్ USD ఫోర్క్ సెటప్‌ను, వెనక భాగంలో 'RS 457'లో కన్పించే ప్రీలోడ్-అడ్జస్టబుల్ మోనోషాక్‌ను కలిగి ఉంది. ఇది RS 457 మాదిరిగానే బ్రేకింగ్ సెటప్‌తో వస్తుంది. అంటే దీని రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి.

పవర్‌ట్రెయిన్: ఇక ఈ కొత్త మోడల్ బైక్ పవర్​ట్రెయిన్ విషయానికొస్తే ఇందులో 'RS 457'లో కనిపించే అదే 457cc, సమాంతర-ట్విన్ ఇంజిన్‌ ఉంటుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 47bhp పవర్, 43.5 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. మెరుగైన లో-ఎండ్ పెర్ఫార్మెన్స్​ కోసం ఏప్రిలియా ఫైనల్ డ్రైవ్‌ను కొంచెం తక్కువ రేషియోతో రీప్లేస్ చేస్తుందని సమాచారం.

'మహా కుంభ్'​పై గూగుల్ గులాబీ రేకుల వర్షం!- మీరు కూడా ట్రై చేయొచ్చు- అదెలాగంటే?

పండగ వేళ చౌకైన రీఛార్జ్ ప్లాన్ లాంఛ్- రోజుకు రూ.8 కంటే తక్కువ ఖర్చుతో అన్​లిమిటెడ్ బెనిఫిట్స్!

త్వరలో ఇండియన్ మార్కెట్​లోకి అతి పెద్ద ఈవీ కారు!- సింగిల్ ఛార్జ్​తో 580km రేంజ్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.