Actress Ruled Out Of Movie By Director : మూవీ ఇండస్ట్రీకి చెందిన కొందరి స్టార్స్ నిజ జీవితాల్లో సినిమాలకు మించిన ట్రాజెడీలు జరగడం మనం చాలా సార్లు చూశాం. చాలా మందికి అవకాశాలు అందినట్లే అంది చేజారిపోతుంటాయి. దీంతో దురదృష్టవశాత్తు ఆ హీరో లేకుంటే హీరోయిన్ అర్ధంతరంగా ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేసిన సందర్భాలు కూడా జరిగాయి. దీంతో రీషూట్‌కి, సినిమా రిలీజ్‌కి అదనపు సమయం అవసరం అవుతుంది.
ఇలానే 2010లో షాహిద్ కపూర్ మూవీ 'ఛాన్స్ పే డ్యాన్స్లో' ఓ నటి అవకాశాన్ని కోల్పోయింది. ఆమెవరో కాదు జియా ఖాన్. దీనికి షాహిద్‌తో ఆమె చాలా స్నేహంగా ఉండటమే కారణమని, ఆమె తన పనిని సరిగ్గా చేసేది కాదంటూ చెప్పుకొచ్చాడు. అందుకే తనను ఆమెని ప్రాజెక్ట్ నుంచి తప్పించామంటూ పేర్కొన్నాడు. ఈ ఒక్క ఘటనే కాదు తన లైఫ్‌లో జియా ఎన్నో ఆటుపోట్లు అనుభవించిందంటూ బీటౌన్ వర్గాలు పలు సందర్భాల్లో పేర్కొన్నాయి.
జియా ఖాన్ కెరీర్
2007లో అమితాబ్ బచ్చన్ నటించిన 'నిశ్శబ్ద్' సినిమాతో బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేసింది జియా ఖాన్. ఆమె బోల్డ్ పెర్ఫార్మెన్స్ అందరి దృష్టిని ఆకర్షించినప్పటికీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. అప్పుడే కెరీర్ మొదలుపెట్టిన ఓ యంగ్ హీరోయిన్‌కి సరైన ప్రారంభం లభించలేదు.
2008లో, ఆమెకు 'గజినీ'లో పెద్ద అవకాశం వచ్చింది. అమీర్ ఖాన్ లీడ్ రోల్లో తెరకెెక్కిన ఈ చిత్రంలో ఆమె సెకండ్ హీరోయిన్‌గా మెరిసింది. బీటౌన్ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ.100 కోట్లు దాటిన తొలి బాలీవుడ్ సినిమాగా నిలిచింది. ఇక ఆమె చివరి సినిమా 'హౌస్‌ఫుల్' (2010). ఇందులో ఆమె చిన్న పాత్రే చేసినా, కథలో చాలా కీలకం. అక్షయ్ కుమార్ నటించిన ఈ కామెడీ మూవీ కూడా హిట్ అందుకుంది. అయితే ఆమె తన కెరీర్‌లో కేవలం మూడు సినిమాల్లోనే నటించింది.
ఊహించని ముగింపు
అయితే జియా ఖాన్ కెరీర్ సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోందన్న సమయంలో ఊహించని విధంగా ముగిసింది. 2013లో ఆమె తన అపార్ట్‌మెంట్‌లో విగతజీవిగా కనిపించింది. 25 సంవత్సరాల వయసులో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఆమె ఆకస్మిక మరణం బాలీవుడ్‌ను దిగ్భ్రాంతికి గురి చేసింది.
70 ఏళ్ల నటుడితో 31 ఏళ్ల నటి రిలేషన్షిప్! - హాట్‌టాపిక్‌గా మారిన జంట!!
ఫ్యామిలీ నో చెప్పినా సినిమాల్లోకి!- 22 ఏళ్ల కెరీర్‌లో రెండే హిట్లు- కానీ ఆస్తి మాత్రం రూ.కోట్లలో!