స్టంట్​ పేరుతో నదిలోకి జంప్​.. తిరిగిరాని యువకుడు.. వీడియో వైరల్​! - నదిలో యువకుడి విన్యాసాలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 15, 2022, 7:29 PM IST

వరద నీటిలో ప్రమాదకర విన్యాసాలు చేస్తూ కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనే మహారాష్ట్రలోని మాలేగావ్​లో వెలుగుచూసింది. స్టంట్స్​ పేరుతో బ్రిడ్జిపైనుంచి గిర్ణా నదిలోకి దూకాడు నయీమ్​ అమీన్​ అనే ఓ యువకుడు. ఇదంతా అతడి స్నేహితులు ఫోన్​లో రికార్డు చేస్తున్నారు. కానీ.. నదిలో వరద ఉద్ధృతికి నయీమ్​ కొట్టుకుపోయాడు. ఎంతసేపు గాలించినా.. అతడి ఆచూకీ లభించలేదు. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు.. మాలేగావ్​లోని గిర్ణా, మోసమ్​ నదులు ఉప్పొంగుతున్నాయి. దీంతో అక్కడకు జనం పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు ప్రమాదకర ప్రాంతాల్లో సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి చోట్ల పోలీసు భద్రత ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.