పట్టపగలే నగల షాప్​లో చోరీకి యత్నం.. ఎదురించిన యజమాని.. వీడియో వైరల్​ - నగల దుకాణంలో చోరీ ఉత్తరాఖండ్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 8, 2022, 9:20 PM IST

ROBBERY CCTV FOOTAGE Haridwar: పట్టపగలే నగల దుకాణంలో చోరీకి యత్నించింది ఓ దొంగల ముఠా. ఉత్తరాఖండ్​, హరిద్వార్​లోని.. రాణిపుర్​ కొత్వాల్​లో గల నగల దుకాణంలో బుధవారం ఈ చోరీకి యత్నించింది. నాటు తుపాకులతో లోపలికి వచ్చిన ఆరుగురు దుండగులు యజమానిపై దాడి చేశారు. అయినా షాపు యజమాని ధైర్యంగా వారిని ఎదుర్కొన్నాడు. దీంతో ఐదుగురు దుండగులు పరారవ్వగా, ఒకడు దొరికిపోయాడు. స్థానికులు.. నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన అంతా షాపులో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఆ దృశ్యాలు వైరల్​గా మారాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.