ETV Bharat / technology

'విశ్వంలో డార్క్ ఎనర్జీ అనేదే లేదు- ఆ సిద్ధాంతాలు తప్పు'- వీడిన అతిపెద్ద మిస్టరీ! - DARK ENERGY SECRET REVEALED

'డార్క్ ఎనర్జీ అనేదే లేదు'- మరి విశ్వం వేగంగా ఎలా విస్తరిస్తోంది?- శాస్త్రవేత్తల సమాధానం ఇదే!

Dark Energy Secret Revealed
Dark Energy Secret Revealed (Photo Credit- ETV Bharat via Copilot Design)
author img

By ETV Bharat Tech Team

Published : 17 hours ago

Biggest Mystery of the Universe: ఈ అనంత విశ్వంలో మానవులకు అంతుచిక్కని ఎన్నో నిగూఢ రహస్యాలు దాగి ఉన్నాయి. కాలాంతరంలో శాస్త్రవేత్తలు వాటిలో చాలా వరకు చేధించగలిగారు. అయితే కొన్ని మాత్రం మిస్టీరియస్​గానే మిగిలిపోయాయి. అలాంటి వాటిలో డార్స్​ ఎనర్జీ అనేది సైన్స్ ప్రపంచంలో ఇప్పటి వరకూ ఉన్న అతిపెద్ద రహస్యం.

డార్క్ ఎనర్జీ అంటే ఏంటో ఇప్పటి వరకూ కచ్చితంగా ఎవరికీ తెలీదు. ఇది ఎలా ఉంటుందో కూడా ఇప్పటి వరకూ ఎవరూ చూడలేకపోయారు. శాస్త్రవేత్తలు గత 100 సంవత్సరాలుగా దీనిపై పరిశోధనలు చేస్తున్నారు. కానీ ఇప్పటివరకూ దీనిపై ఎలాంటి కీలక సమాచారాన్ని కనుగొనలేకపోయారు.

ఐతే కొన్ని దశబ్దాలుగా డార్క్ ఎనర్జీ అనేది చాలా పవర్​ఫుల్ అని, దీని కారణంగానే విశ్వం వేగంగా విస్తరిస్తోందని సైంటిస్టులు చెబుతున్నారు. కానీ ఇది పూర్తిగా తప్పు అంటూ తాజాగా దీనిపై భిన్నమైన వాదనలు తెరపైకి వచ్చాయి. వాస్తవానికి విశ్వంలో అసలు డార్క్ ఎనర్జీ అనేదే లేదని, దీనిపై ఇప్పటి వరకూ ఉన్న సిద్ధాంతాలన్నింటినీ తప్పుగా పరిగణించొచ్చని అంటున్నారు. అసలెందుకు ఇలా అంటున్నారో తెలుసుకుందాం రండి.

వీడిన డార్క్ ఎనర్జీ మిస్టరీ!: ఆల్బర్ట్ ఐన్‌స్టీన్.. దాదాపు 100 సంవత్సరాల క్రితం తన పరిశోధన ద్వారా భూమి, అంగారక గ్రహం, బుధుడు, శని, సూర్యుడు, చంద్రుని వలె విశ్వంలో మరెన్నో గ్రహాలు, ఉపగ్రహాలు, గెలాక్సీలు ఉన్నాయని వెల్లడించారు. అయితే విశ్వంలో ఇన్ని గ్రహాలు, ఉపగ్రహాలు ఉంటే.. అవి ఎందుకు ఒకదానికొకటి ఢీకొనట్లేదు? అనే ప్రశ్న తలెత్తింది. ఈ ప్రశ్నకు సమాధానం కోసం శోధిస్తూ శాస్త్రవేత్తలు 'డార్క్ ఎనర్జీ' అనే మిస్టీరియస్ సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు.

ఈ సిద్ధాంతం ప్రకారం.. డార్క్​ ఎనర్జీ అని పిలుస్తున్న ఈ శక్తి కారణంగానే విశ్వం అన్ని దిశలలో స్థిరమైన వేగంతో విస్తరిస్తోంది. ఈ సిద్ధాంతాన్ని తీసుకొచ్చిన అప్పటి శాస్త్రవేత్తలు కూడా ఇదే నిజం అని భావించారు. అయితే అప్పటి నుంచి ఈ సిద్ధాంతంపై ఎప్పుడూ చాలానే ప్రశ్నలు లేవనెత్తుతూనే ఉన్నాయి. కానీ వాటిలో చాలా ప్రశ్నలకు ఇప్పటి వరకూ సమాధానాలు దొరకలేదు.

అయితే తాజా పరిశోధన ద్వారా సైంటిస్టులు డార్క్​ ఎనర్జీపై అతిపెద్ద రహస్యాన్ని రివీల్ చేశారు. విశ్వంలో అసలు డార్క్ ఎనర్జీ అనేది లేనే లేదని కుండ బద్దలు కొట్టినట్లు వాదిస్తున్నారు. న్యూజిలాండ్​లోని కాంటర్‌బరీ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు సూపర్నోవా (పెద్ద నక్షత్రాలలో పేలుళ్లు) లైట్​ కర్వ్స్​ను లోతుగా విశ్లేషించి ఈ కొత్త సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. ఈ కొత్త రీసెర్చ్​పై 'మంత్లీ నోటీసెస్ ఆఫ్ ది రాయల్ ఆస్ట్రోనామికల్ సొసైటీ లెటర్స్' అనే జర్నల్​లో ప్రచురించారు.

దీనిలో ప్రచురించిన శాస్త్రవేత్తల కొత్త సిద్ధాంతం ప్రకారం.. విశ్వం సమానంగా విస్తరిస్తోంది. అయితే కొంతవరకు ముద్దగా లేదా ఎగుడూదిగుడుగా ఉంటుంది. సింపుల్​గా చెప్పాలంటే ఇది ఒక అల్లం షేప్​ మాదిరిగా అసమానంగా విస్తరిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే విశ్వంలోని కొన్ని భాగాలు వేగంగా విస్తరిస్తున్నాయని, మరికొన్ని నెమ్మదిగా విస్తరిస్తున్నాయని అంటున్నారు. అంతేకానీ దీనికి డార్క్​ ఎనర్జీతో సంబంధం లేదని, అసలు విశ్వంలో డార్క్ ఎనర్జీ అనేదే లేదని గట్టిగా వాదిస్తున్నారు.

మరి డార్క్ ఎనర్జీ లేకుంటే విశ్వం ఎలా విస్తరిస్తోంది? అంటే.. అప్పుడు దీనికి 'టైమ్స్​ స్కేప్' మోడల్​ను సరైనదిగా పరిగణించవచ్చని కాంటర్బరీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తాము చేసిన తాజా పరిశోధనల్లో ఈ విషయాన్ని గుర్తించినట్లు వెల్లడించారు. ఈ సిద్ధాంతాన్ని సింపుల్ టెర్మ్స్​లో 'టైమ్‌స్కేప్' మోడల్ మనకు వివరిస్తుంది. ఇది విశ్వం ఎలా విస్తరిస్తోందనే విషయాన్ని అర్థం చేసుకునేందుకు 'టైమ్', 'డిస్టెన్స్' అనే కొత్త మార్గంలో చూడాలని​ చెబుతుంది.

ఈ 'టైమ్‌స్కేప్' మోడల్.. గురుత్వాకర్షణ సమయాన్ని నెమ్మదిస్తుందని, అంటే గెలాక్సీల లోపల సమయం బయటి ప్రదేశాల కంటే నెమ్మదిగా కదులుతుందని వివరిస్తుంది. ఈ నేపథ్యంలో మనం విశ్వం విస్తరణను 'డార్క్ ఎనర్జీ'గా కాకుండా 'టైమ్ అండ్ డిస్టెన్స్' పరంగా మాత్రమే చూడాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అటువంటి పరిస్థితిలో మనం గెలాక్సీల నుంచి దూరంగా వెళ్లే కొద్దీ.. 'టైమ్ అండ్ డిస్టెన్స్'లో వ్యత్యాసం పెరుగుతుంది. అందువల్ల విశ్వం విస్తరణ వేగంగా ఉన్నట్లు కన్పిస్తుంది. అయితే ఇప్పటి వరకూ దీన్ని డార్క్ ఎనర్జీగా పిలుచుకొచ్చారని కాంటర్బరీ విశ్వవిద్యాలయ సైంటిస్టులు పేర్కొన్నారు. న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లో ఉన్న కాంటర్‌బరీ యూనివర్సిటీలో నిర్వహించిన ఈ పరిశోధనకు ప్రొఫెసర్ డేవిడ్ విల్ట్‌షైర్ నాయకత్వం వహించారు.

అసలు డార్క్ ఎనర్జీ అంటే ఏంటి?: గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు డార్క్ ఎనర్జీని ఒక రహస్య శక్తిగా పరిగణించారు. దీని కారణంగానే విశ్వం వేగంగా విస్తరిస్తోందని భావించారు. సుమారు 100 సంవత్సరాల క్రితం శాస్త్రవేత్తలు విశ్వంలోని గెలాక్సీలు ఒకదానికొకటి దూరంగా కదులుతున్నాయని, మునుపటితో పోలిస్తే ఈ వేగం పెరుగుతుండటాన్ని గమనించారు. ఈ నేపథ్యంలో దీన్ని అర్థం చేసుకునేందుకు అప్పటి శాస్త్రవేత్తలు ఈ డార్క్ ఎనర్జీ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు.

ఈ సిద్ధాంతం ప్రకారం డార్క్ ఎనర్జీ గురుత్వాకర్షణకు విరుద్ధంగా పనిచేసే శక్తి. గురుత్వాకర్షణ వస్తువులను ఒకదానికొకటి దగ్గరగా లాగేందుకు ప్రయత్నిస్తే, దీనికి విరుద్ధంగా పనిచేసే డార్క్ ఎనర్జీ కారణంగానే విశ్వం దూరంగా విస్తరిస్తోందని ఈ సిద్ధాంతం వివరిస్తుంది. విశ్వంలోని శక్తిలో దాదాపు 68% డార్క్ ఎనర్జీ ఉందని అప్పటి శాస్త్రవేత్తలు విశ్వసించారు.

అయితే దీనిపై చాలానే ప్రశ్నలు, అనుమానాలు రేకెత్తగా.. సైంటిస్టులు ఇప్పటి వరకూ చాలా తక్కువ సమాచారం మాత్రమే కనిపెట్టగలిగారు. దీంతో ఇది గత అనేక సంవత్సరాలుగా శాస్త్రవేత్తలకు పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది. కానీ ఇప్పుడు న్యూజిలాండ్ శాస్త్రవేత్తలు విశ్వంలో అసలు డార్క్ ఎనర్జీ అనేదే లేదని చెబుతున్నారు.

భూమికి గుడ్​బై చెప్పనున్న రెండో మూన్- ఆకాశంలో రెండు చందమామలు ఉన్నాయని మీకు తెలుసా?

ఇస్రో మరో అద్భుత ప్రయోగం.. ఈసారి ఏకంగా సూర్యుడిపైనే.. కౌంట్​డౌన్ స్టార్ట్..!

2025లో మొదటి సూర్యగ్రహణం ఎప్పుడో తెలుసా?- ఇది ఏ రాశులపై ప్రభావం చూపిస్తుందంటే..?

వావ్.. ఇది అంతరిక్ష కేంద్రమా..?- డిజైన్​ చూస్తే మతిపోతోందిగా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.