ETV Bharat / entertainment

'ఆ ఒక్క సీక్వెన్స్​కే రూ.18కోట్లు ఖర్చు అయింది' - 'తండేల్' డైరెక్టర్​ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ - THANDEL MOVIE SEQUENCE BUDGET

తండేల్​ సినిమాలో ఒక్క సీక్వెన్స్​కు రూ.18కోట్లు ఖర్చు - సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్న డైరెక్టర్ చందూ మొండేటి

Thandel Movie Sequence Budget
Thandel Movie Sequence Budget (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 31, 2025, 9:27 AM IST

Thandel Movie Sequence Budget : టాలీవుడ్ యంగ్​ హీరో నాగచైతన్య, సాయిపల్లవి లీడ్​ రోల్​ నటించిన చిత్రం తండేల్. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్​లో దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించారు. శ్రీకాకుళం జిల్లా డి మత్స్యలేశం గ్రామంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. వేటకు వెళ్లిన పలువురు మత్స్యకారులు పాకిస్థాన్‌ కోస్ట్ గార్డుకు చిక్కి రెండేళ్లు జైలు శిక్ష అనుభవించిన స్టోరీ లైన్​పై ఈ సినిమా రూపొందింది. ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గురించి దర్శకుడు చందూ ఓ ఆసక్తికర విషయం షేర్​ చేశాడు. ఈ చిత్రంలో ఓ సీక్వెన్స్​ను చిత్రీకరించేందుకు ఏకంగా రూ.18కోట్లు ఖర్చు చేశారట. అంతేకాకుండా పలు ఇంటర్వ్యూల్లో తండేల్​ గురించి ఆసక్తికర విషయాలు షేర్​ చేసుకున్నారు.

'ఆ సినిమా అనుభవంతో'
"నేను ఇంతకముందు తీసిన కార్తికేయ 2 అనుభవం తండేల్‌కు బాగా ఉపయోగపడింది. నేనెప్పుడూ అనుకున్న బడ్జెట్‌ను దాటి సినిమా చేయను. ఈ చిత్రం విషయానికొస్తే రీసెర్చ్‌ తర్వాత స్టోరీ రాయడం పూర్తయింది. తర్వాత హీరో బాడీ లాంగ్వేజ్‌ ఎలా ఉంటే బాగుంటుందో టెస్ట్‌ చేసేందుకు మళ్లీ డి మత్స్యలేశం వెళ్లాం. ఇంకా ఏం జరిగింది? అని అక్కడి వారిని అడగ్గా సముద్రంలో జరిగిన తుపాను, ఆ సమయంలో మత్య్సకారుల సమయస్ఫూర్తి గురించి వివరించారు. అప్పటికే పూర్తయిన స్టోరీకి తగ్గట్టు బడ్జెట్‌ అప్పటికే నిర్ణయించినా ఇలాంటి విజువల్స్‌ ఉంటే బాగుంటుందని భావించా. అదే విషయం చెబితే నిర్మాతలు అంగీకరించారు. ఆ ఒక్క సీక్వెన్స్​కే రూ.18 కోట్లు బడ్జెట్‌ అయింది. లైవ్‌ లొకేషన్‌(సముద్రం)లో, స్టూడియోలో, మినియేచర్, వర్చువల్‌గా సీన్స్​ తీశాం. ఈ సినిమాలో ఎమోషన్‌ ఉంటుంది"

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.