Champions Trophy Opening Ceremony : 2025 ఛాంపియన్స్ ట్రోఫీ పోరుకు మరికొద్ది రోజుల్లో తెరలేవనుంది. ఇప్పటికే వేదికలు, షెడ్యూల్‌ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB), ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రకటించాయి. ఇప్పుడు ప్రారంభ వేడుకలకు సిద్ధమవుతున్నాయి. ఫిబ్రవరి 16న లాహోర్ ఫోర్ట్‌కు సమీపంలోని చారిత్రక ప్రదేశం హుజూరీ బాగ్‌లో ఆ వేడుకలు జరుగుతాయని తెలిపాయి. వివిధ క్రికెట్ బోర్డులకు చెందిన అధికారులు, సెలబ్రిటీలు, దిగ్గజ క్రికెటర్లు, ప్రభుత్వ ప్రతినిధులు సహా పలువురు ముఖ్యమైన అతిథులను వేడుకకు ఆహ్వానించనున్నారు.
కరాచీలో తొలి మ్యాచ్
టోర్నమెంట్ మొదటి మ్యాచ్ ఫిబ్రవరి 19న కరాచీలోని నేషనల్ స్టేడియంలో జరుగుతుంది. మొదటి మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్థాన్, న్యూజిలాండ్ తలపడతాయి.
స్టేడియం మరమ్మతులు, ప్రారంభోత్సవాలు
టోర్నమెంట్ ప్రారంభం కావడానికి ముందు, పాకిస్థాన్‌లోని రెండు ప్రధాన క్రికెట్ స్టేడియాలు రెనోవేషన్ల తర్వాత అధికారికంగా రీఓపెన్ కానున్నాయి. మొదటిది లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియం. ఇది ఫిబ్రవరి 7న ప్రారంభమవుతుంది. ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. రెండోది కరాచీలోని నేషనల్ స్టేడియం. ఈ స్టేడియం ఫిబ్రవరి 11న రీఓపెన్ అవుతుంది. అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ముఖ్య అతిథిగా హాజరవుతారు.
కెప్టెన్ల ప్రెస్ కాన్ఫరెన్స్, ఫొటోషూట్
ఐసీసీ, పీసీబీ టోర్నీలో పాల్గొనే టీమ్‌ల కెప్టెన్లతో విలేకరుల సమావేశం, ఫొటోషూట్ కూడా ప్లాన్ చేస్తున్నాయి. ఈ ఈవెంట్లు లాహోర్‌లో ఫిబ్రవరి 16న ప్రారంభోత్సవం జరిగే రోజునే జరిగే అవకాశం ఉంది.
రోహిత్ శర్మ పాక్ వెళ్తాడా?
లాహోర్‌లో జరిగే ఈవెంట్లకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ హాజరవుతాడా లేదా అనేదానిపై స్పష్టత లేదు. అటు పాకిస్థాన్ క్రికెట్ బోర్డుగానీ, ఐసీసీగానీ ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. పైగా హైబ్రిడ్ మోడల్ ఒప్పందంలో భాగంగా భారత్ తన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది. ఈ అంశంపై బీసీసీఐ కూడా ఇంకా స్పందించలేదు.
దుబాయ్‌లో ఫైనల్?
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఫైనల్ చేరితే, ఫైనల్ మ్యాచ్ వేదిక మారుతుంది. పాకిస్థాన్‌లో కాకుండా మార్చి 9న దుబాయ్‌లో ఫైనల్