లైవ్​ వీడియో: మరుసటి రోజే బర్త్​డే.. అంతలోనే తిరిగిరాని లోకాలకు రెండేళ్ల చిన్నారి - తమిళనాడు ఈరోడ్ వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 19, 2022, 6:57 PM IST

Updated : Jul 21, 2022, 2:07 PM IST

మహారాష్ట్రలోని పుణె లోనావాలా ప్రాంతంలో విషాదం జరిగింది. ఓ రెండేళ్ల చిన్నారి ఈతకొలనులో పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈనెల 13న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చనిపోయిన బాలుడిని శివ్​బా అఖిల్​ పవార్​గా గుర్తించారు పోలీసులు. పవార్​కు కవల సోదరి ఉందని.. 14న వీరి పుట్టినరోజు కావడం వల్ల తల్లిదండ్రులు పిల్లలతో పాటు రిసార్ట్​కు వచ్చారని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే అనుకోకుండా ఇలా జరిగిందని చెప్పారు. మరోవైపు తమిళనాడులోని ఈరోడ్​ జిల్లాలో ఓ కళాకారుడు అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయాడు. కుప్పన్తురయ్​లోని ఓ ఆలయ ఉత్సవ వేడుకల సందర్భంగా నృత్యం చేస్తున్న రాజయ్యన్​కు గుండెపోటు రాగా.. అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు.
Last Updated : Jul 21, 2022, 2:07 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.