ఈ ఫ్యామిలీలో నలుగురూ ఒకే రోజు పుట్టారు.. సెలబ్రేషన్స్ వీడియో వైరల్!
🎬 Watch Now: Feature Video
సాధారణంగా కొన్ని కుటుంబాల్లో ఇద్దరు పిల్లలు లేదా తండ్రీ పిల్లలు లేదా తల్లీ పిల్లలు.. అలా ఒకే రోజు బర్త్డే జరుపుకోవడం వినే ఉంటాం. కానీ కేరళకు చెందిన ఓ కుటుంబంలో మాత్రం నలుగురిదీ ఒకే రోజు బర్త్డే. కన్నూరు-కాసర్గోడ్ సరిహద్దు ప్రాంతానికి చెందిన అనీష్, అతడి భార్య అజిత, ఇద్దరి పిల్లలు ఆరాధ్య, ఆగ్నయ్లు మే 25న పుట్టారు. దీంతో ఈ ఏడాది వారు నలుగురూ కలసి ఒకే కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్గా మారింది.