ETV Bharat / business

తక్కువ బడ్జెట్లో యూట్యూబ్‌ స్టూడియో సెటప్‌ చేయాలా? ఈ సింపుల్ ప్రాసెస్ ఫాలో అవ్వండి! - YOUTUBE STUDIO SETUP IN 2025

మీ యూట్యూబ్‌ ఛానల్ సక్సెస్ కావాలా? ఈ బెస్ట్‌ టిప్స్ మీ కోసమే!

YouTube Studio Setup
YouTube Studio Setup (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 18, 2025, 5:07 PM IST

YouTube Studio Setup In 2025 : ఈ 2025లో కొత్తగా యూట్యూబ్ ఛానల్‌ పెట్టాలని అనుకుంటున్నారా? ఇందుకోసం మంచి యూట్యూబ్‌ స్టూడియో ఏర్పాటు చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. తక్కువ బడ్జెట్లో మంచి యూట్యూబ్ స్టూడియోను ఎలా సెటప్‌ చేసుకోవాలో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

యూట్యూబ్‌ ఛానల్‌ మొదలు పెట్టాలంటే, కొన్ని కీలకమైన పరికరాలను కొనుక్కోవాల్సి ఉంటుంది. అవి: కెమెరా, ట్రైపాడ్‌, మైక్రో ఫోన్‌, లైటింగ్‌, ఆడియో, వీడియో ఎడిటింగ్‌ సాఫ్ట్‌వేర్స్‌.

1. కెమెరా : యూట్యూబ్ ఛానల్‌ పెట్టాలంటే మంచి కెమెరా ఉండాలి. మీ బడ్జెట్ తక్కువగా ఉంటే, మీ ఆండ్రాయిడ్‌ సెల్‌ఫోన్‌నే కెమెరాగా వాడుకోవచ్చు. ఐఫోన్‌ కెమెరా కూడా బాగానే ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర కొంచెం ఎక్కువ డబ్బులు ఉంటే, మంచి డీఎస్‌ఎల్‌ఆర్‌ కెమెరా కొనుక్కోవచ్చు. ఈ డీఎస్ఎల్‌ఆర్‌ కెమెరాలు మీడియం బడ్జెట్ నుంచి ప్రీమియం రేంజ్‌ వరకు అన్నీ మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. వీలైనంత వరకు మీ కెమెరా - ఫుల్‌ హెచ్‌డీ, 4కె, 8కె వీడియోలు తీసుకునే విధంగా ఉండడం మంచిది.

camera
కెమెరా (ETV Bharat)

2. ట్రైపాడ్‌, గింబల్‌ : మీరు కనుక డీఎస్‌ఎల్‌ఆర్‌ కెమెరా కొనుక్కుంటే, కచ్చితంగా మంచి ట్రైపాడ్ తీసుకోవాలి. మీ దగ్గర కాస్త ఎక్కువ బడ్జెట్ ఉంటే, మంచి గింబల్ తీసుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో ఫోన్‌, డీఎస్‌ఎల్‌ఆర్‌ గింబల్స్‌ అన్ని బడ్జెట్‌ రేంజ్‌ల్లో లభిస్తున్నాయి.

tripod
ట్రైపాడ్‌ (ETV Bharat)
gimbal
గింబల్‌ (ETV Bharat)

3. లైటింగ్‌ : ఎంత మంచి కెమెరా కొన్నప్పటికీ, సరైన లైటింగ్ లేకపోతే వీడియో క్వాలిటీ బాగుండదు. అందువల్ల మంచి ఎల్‌ఈడీ లైట్స్‌, ఆర్‌జీబీ లైట్స్‌, రింగ్‌ లైట్స్‌ లాంటివి కొనుక్కోవచ్చు. ఇవేమీ లేకపోతే నేరుగా సన్‌లైట్‌లోనూ వీడియో షూట్ చేయవచ్చు.

ring light
రింగ్ లైట్‌ (ETV Bharat)

4. మైక్రోఫోన్‌ : వీడియో ఎంత బాగా ఉన్నప్పటికీ, ఆడియో క్వాలిటీ బాగా లేకపోతే యూజర్లు దానిని స్కిప్ చేస్తారు. కనుక మంచి మైక్రోఫోన్‌ తీసుకోవడం మంచిది. ఇందుకోసం నాయిస్ కాన్సిలేషన్‌ ఫీచర్‌ ఉన్న మైక్‌ కొనుక్కోవాలి. వీటితోపాటు ఎక్స్‌టర్నల్‌ సౌండ్ మిక్సర్‌లు కూడా కొనుక్కుంటే, మరింత క్వాలిటీతో ఆడియో రికార్డ్ చేయవచ్చు. పాడ్ కాస్ట్ చేసేవాళ్లు అయితే మరింత మంచి మైక్ కొనుక్కోవడం మంచిది.

mic
మైక్‌ (ETV Bharat)

5. ఆడియో, వీడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్స్‌ : యూట్యూబ్‌ వీడియోలను చక్కగా ఎడిటింగ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం మంచి ఆడియో, వీడియో సాఫ్ట్‌వేర్స్‌ను కొనుక్కోవాల్సి ఉంటుంది. బడ్జెట్ తక్కువగా ఉన్నవారు ఫ్రీ యాప్స్ కూడా వాడుకోవచ్చు. ప్రస్తుతం ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌లకు సపోర్ట్ చేసే అనేక ఆడియో, వీడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఫ్రీ టూల్స్‌ను మీరు వాడుకోవచ్చు. కాస్త ఎక్కువ ఫీచర్లు కావాలంటే, కచ్చితంగా ప్రీమియం యాప్స్‌ లేదా సాఫ్ట్‌వేర్స్‌ కొనుక్కోవాలి. మీ వద్ద ల్యాప్‌టాప్‌/ కంప్యూటర్‌ ఉంటే, ప్రీమియర్‌ ప్రో, ఫైనల్‌ కట్ ఎక్స్‌, డావెన్సీ రిసాల్వ్‌ లాంటి వీడియో ఎడిటర్స్ వాడుకోవచ్చు. వీటి ధర ఎక్కువ అని అనిపిస్తే కాన్వా, వీమియో లాంటి వెబ్‌ యాప్స్‌ వాడుకోవచ్చు. యూట్యూబ్ క్రియేటర్‌ స్టూడియో కూడా అందుబాటులో ఉంది.

video editing software
వీడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్స్‌ (ETV Bharat)

6. రూమ్‌ : యూట్యూబ్‌ స్టూడియో పెట్టడానికి కనీసం చిన్న రూమ్‌ అయినా ఉండాలి. ఇది కాస్త విశాలంగా ఉంటే మరీ మంచిది. ఈ రూమ్‌లో వీడియో షూట్ చేసేటప్పుడు, రణగొణ ధ్వనులు రికార్డ్ కాకుండా ఉండడానికి వీలుగా ఎకోస్టిక్స్‌ పెట్టుకోవాలి.

YouTube studio
యూట్యూబ్‌ స్టూడియో రూమ్‌ (ETV Bharat)

యూట్యూబ్‌ వీడియో క్రియేట్ చేయడం ఎలా?
యూట్యూబ్ వీడియో షూట్‌ చేసిన తరువాత దాని ఆడియోను క్లీన్ చేయాలి. లేదా మంచి స్టూడియోలో డబ్బింగ్ చేసుకోవచ్చు. వీడియోను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ఫిల్టర్స్‌, ఎఫెక్ట్స్‌, ట్రాన్సిషన్స్‌ యాడ్ చేసుకోవచ్చు. మీరు కనుక వేర్వేరు భాషల్లో మీ వీడియోను ప్రెజెంట్ చేయాలని అనుకుంటే, మంచి క్యాప్షన్స్‌ కూడా పెట్టుకోవచ్చు. ఆటోమేటిక్ క్యాప్షన్స్‌ ఇచ్చే సాఫ్ట్‌వేర్స్ కూడా నేడు అందుబాటులో ఉన్నాయి.

  • థంబ్‌నెయిల్‌ : మీరు క్రియేట్ చేసిన వీడియో ఎంత బాగున్నప్పటికీ, దానిని యూజర్లు చూడాలంటే కచ్చితంగా మంచి ఆకర్షణీయమైన థంబ్‌నెయిల్‌ పెట్టుకోవాలి. ఇందుకోసం మంచి ఫొటో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌ వాడుకోవాలి.
  • మ్యూజిక్ & సౌండ్‌ ఎఫెక్ట్స్‌ : మీ వీడియో చూడడానికి అనువుగా, యూజర్లను అలరించే విధంగా ఉండాలంటే కచ్చితంగా మంచి మ్యూజిక్, సౌండ్‌ ఎఫెక్ట్స్‌ యాడ్ చేయడం మంచిది. ఇందుకోసం కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్‌ను వాడుకోవచ్చు. ప్రీమియం మ్యూజిక్ కావాలంటే డబ్బులు పే చేసి, ఆడియో ట్రాక్స్‌ను కొనుక్కోవచ్చు. మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్ అయినా తీసుకోవచ్చు.
  • యూట్యూబ్‌ ఎస్‌ఈఓ టూల్స్ : మీరు ఎంత మంచి వీడియో క్రియేట్ చేసినప్పటికీ దానిని ఎక్కువ మంచి చూడకపోతే ఏం లాభముండదు. అందుకే మంచి ఎస్‌ఈఓ టూల్స్‌ వాడడం మంచిది.
  • కీవర్డ్ ప్లానర్‌ : మీ వీడియో మంచిగా ర్యాంక్ అవ్వాలంటే, కచ్చితంగా అట్రాక్టివ్ టైటిల్‌ పెట్టాలి. అలాగే మంచి ట్యాగ్స్‌, హ్యాష్‌ట్యాగ్స్‌, డిస్క్రిప్షన్ పెట్టాలి. మంచి కీవర్డ్స్‌ పెట్టడానికి వీలుగా కీవర్డ్ ప్లానర్ తీసుకోవాలి.

యూట్యూబ్‌ ఛానల్ సక్సెస్ మంత్ర!
యూట్యూబ్ ఛానల్ పెట్టినంత మాత్రాన సరిపోదు. దానిని చక్కగా మెయింటైన్ చేయాలి. రెగ్యులర్‌గా వీడియోలు పెట్టాలి. మీరు కనుక పాడ్‌కాస్ట్ చేస్తుంటే, యూజర్లకు కావాల్సిన మంచి కంటెంట్‌ను ఇవ్వాలి. ఇందుకోసం యూట్యూబ్ అనలిటిక్స్‌ వాడుకోవాలి. యూజర్ల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి. వారు పెట్టే కామెంట్లకు రిప్లై ఇస్తుండాలి. వీలైనంత వరకు మీ కంటెంట్‌ క్వాలిటీని పెంచుకుంటూ వెళ్లాలి. ట్రెండ్‌కు అనుగుణంగా మీ వీడియో కంటెంట్‌ను మార్చుకోవాలి. ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే, కచ్చితంగా మీ యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆల్‌ ది బెస్ట్‌!

YouTube success tips
యూట్యూబ్ సక్సెస్ టిప్స్‌ (ETV Bharat)

నోట్‌ : సోషల్‌ మీడియాలో పాపులర్ కావడం అంత సులభం కాదు. దీని కోసం ఎంతో ఓపిక ఉండాలి. పక్కా ప్లానింగ్‌తో ముందుకు వెళ్లాలి. కొంత మంది చేస్తున్న ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని, వ్యవహారాన్ని మానేసి, నేరుగా యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్ ఛానల్స్ పెడుతూ ఉంటారు. కానీ ఇది ఏమాత్రం మంచిది కాదు. మీ మెయిన్ స్ట్రీమ్‌ ఇన్‌కమ్‌ సోర్స్‌ను వదలకుండా, యూట్యూబ్‌ ఛానల్‌ను మెయింటైన్ చేయాలి. అప్పుడే మీరు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉండగలుగుతారు. లేకుంటే భవిష్యత్‌లో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. జర జాగ్రత్త!

కంటెంట్ క్రియేటర్లకు యూట్యూబ్ వార్నింగ్​ - ఇకపై అలాంటి టైటిల్స్, థంబ్​నెయిల్స్​ పెడితే చర్యలు తప్పవ్!

యూట్యూబ్ వీడియోలతో ఎంత సంపాదించొచ్చు? రూ.8లక్షలు ఖర్చు చేసినా ఆమె ఎందుకు ఫెయిల్?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.