ETV Bharat / lifestyle

సండే స్పెషల్: ఎంతో రుచిగా ఉండే 'షాహి చికెన్ కుర్మా'- ఒక్కసారి తిన్నారంటే రుచి మర్చిపోరు! - HOW TO MAKE SHAHI CHICKEN KORMA

-రొట్టెలు, నాన్, రైస్​లో కూడా బాగుటుంది -కొత్త ఫ్లేవర్స్ ఇష్టపడేవారికి తెగ నచ్చేస్తుందట!

Shahi Chicken Korma Recipe
Shahi Chicken Korma Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Lifestyle Team

Published : Jan 18, 2025, 5:23 PM IST

Shahi Chicken Korma Recipe: ఎప్పుడూ చికెన్​తో రొటీన్​ కర్రీ చేసుకుని బోర్ కొడుతుందా? కొత్తగా ఏదైనా మంచి ఫ్లేవర్​ ఆస్వాదించాలని అనుకుంటున్నారా? అయితే, ఒకసారి షాహి చికెన్​ను ట్రై చేయండి సూపర్​గా ఉంటుంది. దీని గ్రేవీ, రుచి అద్భుతంగా ఉంటుంది. ఇది రైస్​తో పాటు రొట్టెలు, నాన్​లతోకూడా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఇందులోకి కావాల్సిన పదార్థాలు ఏంటి? తయారీ విధానం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

  • అర కిలో చికెన్
  • అర కప్పు ఉల్లిపాయ తరుగు
  • 15 బాదం పప్పులు
  • 2 టేబుల్ స్పూన్ల సారపప్పు (చిరోంజి)
  • 15 జీడిపప్పు
  • 4 టేబుల్ స్పూన్ల నూనె
  • 3 టేబుల్ స్పూన్ల నెయ్యి
  • కొద్దిగా జాపత్రి
  • ఒక ఇంచు దాల్చిన చెక్క
  • అర టీ స్పూన్ మిరియాలు
  • 4 యాలకులు
  • ఒక బిర్యానీ ఆకు
  • ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
  • ముప్పావు కప్పు మీగడ పెరుగు
  • అర టేబుల్ స్పూన్ ధనియలా పొడి
  • ఒక టేబుల్ స్పూన్ ఎల్లో చిల్లీ పౌడర్ లేదా కారం
  • పావు టీ స్పూన్ పసుపు
  • ఒక టీ స్పూన్ రోజ్ వాటర్
  • అర టీ స్పూన్ కేవ్​డా వాటర్
  • 2 చిటికల జాపత్రి పొడి
  • అర టీ స్పూన్ కశ్మీరి కారం
  • లవంగాల పొడి
  • అర టీ స్పూన్ నెయ్యి
  • కొద్దిగా కొత్తిమీర తరుగు

తయారీ విధానం

  • ముందుగా స్టౌ ఆన్ చేసి ఓ గిన్నెలో నీళ్లు పోసి అందులో బాదం, చిరోంజి, జీడిపప్పులు వేసి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. (వీలైతే వీటిని రాత్రంతా నానబెట్టి కూడా చేసుకోవచ్చు)
  • ఆ తర్వాత వీటిని చల్లార్చి బాదం, చిరోంజి పప్పుల పొట్టును తీసేసి.. మిక్సీలో వేసి అందులోనే అర కప్పు ఎర్రగా వేయించిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా నీరు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
  • మరోవైపు కడాయిలో నూనె, నెయ్యి వేడి చేసి అందులో జాపత్రి, దాల్చిన చెక్క, మిరియాలు, యాలకలు, బిర్యానీ ఆకు వేసి కాసేపు వేయించాలి.
  • ఆ తర్వాత చికెన్, ఉప్పు వేసి హై ఫ్లేమ్​లో నేతిలో బాగా వేయించుకోవాలి. సుమారు 8 నిమిషాల తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి.
  • ఇప్పుడు చికెన్​పైన ఓ జల్లెడ పెట్టి అందులో మీగడ పెరుగు, ధనియాల పొడి, ఎల్లో చిల్లీ పౌడర్, పసుపు వేసి బాగా కలిపి వేసుకోవాలి. (ఒక వేళ ఎల్లో చిల్లీ పౌడర్ లేకపోతే మన కారం లేదా పచ్చిమిర్చి-ఉల్లిపాయ ముక్కల పేస్ట్ వేసుకోవచ్చు)
  • అనంతరం ఈ పెరుగును బాగా కలిపి మూత పెట్టి 15 నిమిషాల పాటు నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి.
  • ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసుకున్న బాదం-కాజు పేస్ట్, ఒకటింపావు కప్పు వేడి నీళ్లు పోసి కలిపి మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. (అడుగు అంటకుండా ఉండేందుకు మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి)
  • ఆ తర్వాత ఇందులో రోజ్ వాటర్, కేవ్​డా వాటర్, జాపత్రి పొడి, కశ్మీరి కారం వేసి కలిపి మూత పెట్టి 3 నిమిషాల ఉడికించాలి.
  • అనంతరం చికెన్ మధ్యలో ఓ చిన్న గిన్నె పెట్టి అందులో కాల్చిన బొగ్గు లేదా కొబ్బరి పెంకును పెట్టి దానిపై లవంగాల పొడి, నెయ్యి వేసి మూత పెట్టి 4 నిమిషాల పాటు వదిలేయాలి. (ఇలా చేస్తే స్మోకీ ఫ్లేవర్ వస్తుంది)
  • చివర్లో మధ్యలో పెట్టిన కప్పు తీసి కొత్తిమీర తరుగు చల్లి కలిపి దింపేసుకుంటే సూపర్ షాహి చికెన్ కుర్మా రెడీ!

'తొక్కలో పచ్చడి' మీరెప్పుడైనా తిన్నారా? తెలుగు వారి స్పెషల్ రెసిపీ ఒక్కసారి టేస్ట్ చేయండి!

ఈ 'మసాలా ఎగ్ పులుసు' ఎప్పుడైనా తిన్నారా? బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.