కుండపోత వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం.. హెలికాప్టర్లతో సహాయక చర్యలు - గుజరాత్​ అప్డేట్లు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 11, 2022, 4:48 PM IST

Updated : Jul 11, 2022, 5:40 PM IST

Heavy Rains In Gujarat: గుజరాత్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అహ్మదాబాద్‌లో గత 5 ఏళ్లలో జులై నెలలో ఎన్నడూ లేనంత రికార్డుస్థాయి వర్షపాతం నమోదైంది. కేవలం 3 గంటల్లోనే 115 మిల్లీ మీటర్లకుపైగా వర్షం పడినట్లు అధికారులు వెల్లడించారు. పలు ప్రాంతాల్లో భవనాల్లోకి భారీగా వరదనీరు చేరింది. సెల్లార్లు, గ్రౌండ్‌ ఫ్లోర్‌లు నీటితో నిండిపోయాయి. నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తుండడం వల్ల లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. వల్సాద్​ జిల్లాలో వరద నీటిలో చిక్కుకున్న వందలాది మంది ప్రజలు ఎన్డీఆర్​ఎఫ్​ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. వరదనీటిలో చిక్కుకున్న వారి కోసం హెలికాప్టర్ల ద్వారా గాలింపు చర్యలు చేపడుతున్నారు అధికారులు.
Last Updated : Jul 11, 2022, 5:40 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.