Delhi Congress Releases 3rd List : దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న తమ పార్టీ అభ్యర్థుల మూడో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. మొత్తం 16 మంది పేర్లను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. కేంద్ర మాజీ మంత్రి కృష్ణతీర్థ్ పటేల్ నగర్ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. కౌన్సిలర్ ఆరిబాఖాన్‌కు ఓఖ్లా అసెంబ్లీ స్థానం నుంచి అవకాశం దక్కింది.
గోకల్‌పుర్ ఎస్సీ నియోజకవర్గంలో తొలుత ప్రమోద్ కుమార్ జయంత్ పేరు ప్రకటించగా, ఆయన స్థానంలో ఈశ్వర్ బాగ్రీ పోటీ చేస్తారని తాజాగా హస్తం పార్టీ వెల్లడించింది. మొత్తం 70 నియోజకవర్గాలకుగానూ ఇప్పటివరకు 63 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్నాయి.
ఈ నెల ప్రారంభంలో విడుదల చేసిన జాబితాలో కల్కాజీ నియోజకవర్గం నుంచి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆల్కాలంబా పోటీ చేస్తారని పార్టీ ప్రకటించింది. కానీ ఈ స్థానంలో ఆప్ నుంచి ప్రస్తుత దిల్లీ సీఎం ఆతిశీ పోటీ చేస్తున్నారు. న్యూదిల్లీలో ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేస్తున్నారు. ఆయనపై మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్‌ను కాంగ్రెస్ బరిలో నిలిపింది.
Congress releases the third list of 16 candidates for #DelhiElections2025 pic.twitter.com/ya29BoeE5U
— ANI (@ANI) January 14, 2025
'ప్రధాని మోదీ అడుగుజాడల్లో కేజ్రీవాల్- తప్పుడు వాగ్దానాల్లో దొందూ దొందే!'
ప్రధాని Vs మాజీ సీఎం- మోదీ, కేజ్రీ ఫొటోలతో ప్రచారం- దిల్లీ పీఠం దక్కేదెవరికో?