ETV Bharat / international

భారతీయులను​ వెనక్కు పంపించండి - రష్యాను కోరిన భారత విదేశాంగశాఖ - MEA ASKS RUSSIA TO RELEASE INDIANS

రష్యా యుద్ధంలో భారతీయుడు మృతి - తీవ్రంగా పరిగణించిన కేంద్రం

Russian military
Russian military (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 14, 2025, 8:46 PM IST

MEA Asks Russia To Release Indians : రష్యా తరఫున యుద్ధంలో పాల్గొన్న కేరళ వాసి మృతి చెందడాన్ని భారత విదేశాంగశాఖ (ఎంఈఏ) తీవ్రంగా పరిగణించింది. రష్యా తరఫున యుద్ధంలో పాల్గొంటున్న భారతీయులను వెంటనే విడుదల చేయాలని కోరింది. 'ఈ విషయాన్ని మాస్కోలోని రష్యన్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. దిల్లీలోని రష్యన్‌ రాయబార కార్యాలయ అధికారులతోనూ మాట్లాడాము. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మిగిలిన భారతీయులను వెనక్కు పంపించాలని కోరాము' అని భారత విదేశాంగశాఖ ప్రకటన విడుదల చేసింది.

రష్యా సైన్యంలో పనిచేస్తున్న కేరళకు చెందిన టీబీ బినిల్‌ (32) అనే యువకుడు మరణించారు. అంతేకాదు అతని సమీప బంధువు టీకే జైన్‌ (27)కు కూడా గాయాలయ్యాయి. బినిల్‌ చనిపోయిన విషయాన్ని మాస్కోలోని భారత రాయబార కార్యాలయం తెలియజేసిందని అతని బంధువులు మీడియాతో చెప్పారు. ఈ విషయం తెలిసి బినిల్‌ భార్య షాక్‌కు గురయ్యారు. ఆయన్ను రష్యా నుంచి సురక్షితంగా తీసుకురావాలని అధికారులకు విజ్ఞప్తులు చేస్తున్న సమయంలోనే ఈ విషాద వార్త వినాల్సి వచ్చిందని ఆమె వాపోయారు.

బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం
బినిల్ మృతి పట్ల కేంద్ర విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవడానికి అవసరమైన సహాయ, సహకారాలు అందజేస్తామని స్పష్టం చేశారు. 'మాస్కోలోని భారత రాయబార కార్యాలయం - మృతుడి కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతోంది. మృతదేహాన్ని త్వరగా భారత్‌కు రప్పించేందుకు రష్యన్‌ అధికారులతో మాట్లాడుతున్నాం. గాయపడిన జైన్‌ను కూడా విడుదల చేసి, ఇండియాకు పంపించాలని కోరాము' అని ఎక్స్‌ పోస్టులో వెల్లడించారు.

గతేడాది రష్యాలోని కజాన్‌లో 16వ బ్రిక్స్‌ సదస్సు జరిగింది. ఆ సమయంలోనూ ఈ అంశాన్ని భారత్ లేవనెత్తింది. ప్రధాని నరేంద్రమోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్‌ మధ్య చర్చలు జరిగాయని అప్పట్లో భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్‌ మిశ్రీ తెలిపారు. రష్యా అంగీకరించడం వల్ల అనేక మంది భారతీయులు స్వదేశానికి తిరిగి రాగలిగారని ఆయన ప్రకటించారు. మాస్కోలోని భారతీయ రాయబార కార్యాలయం తాజాగా 20 కేసులను పరిష్కరించే మార్గాలను అన్వేషిస్తోంది. వారిని స్వదేశానికి పంపించేందుకు రష్యా అధికారుల సహకారం తీసుకుంటోంది.

శత్రువులకు దొరికితే సొంతవాళ్లే చంపేస్తారు! ఉత్తర కొరియా సైనికులకు క్షణక్షణం భయం భయం!

ఉక్రెయిన్‌కు అమెరికా రూ.4,293 కోట్ల సైనిక సహాయం - ఆయుధాలు, క్షిపణులు కూడా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.